పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ | Police Arrest Three Suspects For West Bengal Law Student Incident | Sakshi
Sakshi News home page

kolakata: పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

Jun 27 2025 2:19 PM | Updated on Jun 27 2025 4:09 PM

Police Arrest Three Suspects For West Bengal Law Student Incident

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్‌ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. 

బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.  

కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్‌ కోల్‌కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్‌లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్‌రేప్‌ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం యూనిట్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. 

కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులు
బాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్‌ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్‌ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పా.  అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్‌లోకి  నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని  చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.

దారుణం జరుగుతుండా వీడియోలు తీసి
వద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్‌కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్‌తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా  పోలీసులు నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.

నిందితులకు ఐదురోజుల పోలీస్‌ కస్టడీ
జూన్ 26న తల్బాగన్ క్రాసింగ్‌లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్‌లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. 

పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు 
గతేడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్‌ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.

స్పందించిన టీఎంసీ
ఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై  పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.  

పోలీసులే బాధ్యత వహించాలి
ఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్‌కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్‌కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. 
 

 

బాధితురాలికి అండగా బీజేపీ
మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్‌జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement