
తిరువనంతపురం: ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ అంటే కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రతిరూపంగా నిలవడం కూడా. తాజాగా కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారిణి అందుకు నిదర్శనంగా నిలిచారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ప్రయత్నం చేయడమే కాదు.. రోడ్డు మధ్యలో పరుగెత్తుతూ వాహనాలను పక్కకు జరుపుతూ సంకేతాలు ఇచ్చారు. ఆమె చేసిన ఈ చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఆగస్టు 9న కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ అంబులెన్స్ జూబ్లీ మిషన్ ఆస్పత్రి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో పోలీసు వాహనంలో వెళ్తున్న స్టేషనల్ హౌస్ ఆఫీసర్ అపర్ణా లవకుమార్ ఆ అంబులెన్స్‌ను గమనించారు. వెంటనే పోలీసు వాహనం నుంచి మెరుపు వేగంతో బయటకు వచ్చారు. అంబులెన్స్ ముందు పరుగెత్తుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ సకాలంలో ఆస్పత్రికి చేరడం,రోగికి చికిత్స అందడంపై అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అపర్ణా మానవత్వం చూపించిన ఘటనలో కోకొల్లలు. 2019లో త్రిసూర్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తుండగా ఐదోతరగతి చదువుతున్న చిన్నారి బాధడను చూడలేక ఆమె తన జుట్టును పూర్తిగా తీసేసి కేన్సర్ పేషెంట్ల కోసం దానం చేశారు. పోలీస్ శాఖ నియమాల ప్రకారం జుట్టు పూర్తిగా తీసేసుకోవడానికి అనుమతి అవసరం. ఆమె నిర్ణయాన్ని త్రిసూర్ రూరల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్వాగతించారు.
2008లో ఓ మృతదేహాన్ని విడుదల చేయించేందుకు ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు తన బంగారు గాజులను ఇచ్చారు. ఇలా విధులు నిర్వహిస్తున్న అపర్ణా లవకుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Big Salute to #Kerala police woman ASI Aparna Lavakumar. In Thrissur, she ran ahead of a stalled ambulance in heavy traffic, personally urging vehicles aside so that the emergency vehicle with the patient could proceed safely. Aparna was previously praised for pawning her gold… https://t.co/RoUqXSzwAv pic.twitter.com/mip2MMLO7k
— Ashish (@KP_Aashish) August 11, 2025