
కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఐఐఎంలో అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయిన వేళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రి అత్యాచారం జరగలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురిపై అసలు అత్యాచారం జరగలేదని, ఆటోలోంచి పడిపోతే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని అత్యాచారం వార్తలను కొట్టిపారేశారు.
దీనిపై శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం జరిగిందనే బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఈరోజు(శనివారం. జూలై 12) తన కూతురిపై అత్యాచారం జరగలేదంటూ వెల్లడించారు. ‘ ‘నిన్న రాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఆటో రిక్షా నుంచి పడిపోయిందని ఆమె ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌ను ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ గుర్తించాం. పోలీసులే ఆమెను ఎస్‌ఎస్‌కేమ్ న్యూరాలజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నా కూతురు తనపై అత్యచారం జరగలేదని నాకు చెప్పింది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ ఘటనతో ఏం సంబంధం లేదు’ అని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఐఐఎమ్ క్యాంపస్ బాయ్స్ హాస్టల్‌లో అత్యాచారం జరిగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. బాధితురాలి తండ్రి తాజాగా ముందుకు అది అత్యాచారం కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.