breaking news
IIM Calcutta
-
కోల్‌కతా ‘అత్యాచారం’ కేసులో ట్విస్ట్
కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఐఐఎంలో అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయిన వేళ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రి అత్యాచారం జరగలేదంటూ ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురిపై అసలు అత్యాచారం జరగలేదని, ఆటోలోంచి పడిపోతే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అది కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని అత్యాచారం వార్తలను కొట్టిపారేశారు. దీనిపై శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం జరిగిందనే బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఈరోజు(శనివారం. జూలై 12) తన కూతురిపై అత్యాచారం జరగలేదంటూ వెల్లడించారు. ‘ ‘నిన్న రాత్రి మాకు ఫోన్ వచ్చింది. ఆటో రిక్షా నుంచి పడిపోయిందని ఆమె ఫోన్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌ను ట్రేస్ అవుట్ చేసి లొకేషన్ గుర్తించాం. పోలీసులే ఆమెను ఎస్ఎస్కేమ్ న్యూరాలజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. నా కూతురు తనపై అత్యచారం జరగలేదని నాకు చెప్పింది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ ఘటనతో ఏం సంబంధం లేదు’ అని తెలిపారు.ఈ కేసుకు సంబంధించి ఐఐఎమ్ క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో అత్యాచారం జరిగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. బాధితురాలి తండ్రి తాజాగా ముందుకు అది అత్యాచారం కాదని, కేవలం యాక్సిడెంట్ మాత్రమేనని చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. -
Kolkata: బాలుర హాస్టల్లో విద్యార్థినిపై అకృత్యం.. ఒకరి అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్‌కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
ఐఐఎం కోలకతా విద్యార్థుల అరుదైన ఘనత
కోలకతా: ఐఐఎం విద్యార్థులంటే.. నైపుణ్యాలకు ప్రతిభాపాటవాలకు పెట్టిందిపేరు. అందుకే టాప్ కంపెనీలు వారిని రిక్రూట్ చేసుకునే విషయంలో ముందు వరసలో ఉంటాయి. తాజాగా ప్రఖ్యాత మేనేజ్మెంట్ సంస్థ కోలకతా ఐఐఎం విద్యార్థులు అరుదైన ఘనతను సాధించారు. దేశంలో మొట్టమొదటి ట్రిపుల్ క్రౌన్ అక్రిడిటేషన్ పొందిన కోలకతా మేనేజ్మెంట్ సంస్థ ఈ ఏడాది వంద శాతం ప్లేస్మెంట్ నమోదు చేసింది. ముఖ్యంగా 180 టాప్ కంపెనీలతో సహా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నీతి ) ఆయోగ్ మొదటిసారిగా ఈ క్యాంపస్‌ను సందర్శించి, అయిదుగురు ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేయడం విశేషం. 2017-2019 బ్యాచ్ లోని మొత్తం విద్యార్థులను నీతి ఆయోగ్, వివిధ టాప్ కంపెనీలు భారీ ఆఫర్లతో ఎంపిక చేసుకున్నాయని ఐఐఎం కోలకత్తా వెల్లడించింది. వేర్వేరు రంగాల్లోని 180 సంస్థలు వేసవి నియామకాలకు ఐఐఎం కలకత్తాకు వచ్చాయని తెలిపింది. ముఖ్యంగా గోల్డ్‌మాన్ సాచ్స్, కోక్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) లాంటి తమ బిజినెస్ స్కూల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయగా, మొత్తం బ్యాచ్‌లో 41 శాతం,188 ఆఫర్లు ఆర్థిక, కన్సల్టింగ్ రంగాల నుండి వచ్చాయి. ఫైనాన్స్ విభాగంలో గోల్డ్‌మేన్ సాచ్స్ అత్యధిక ఆఫర్లను ఆఫర్ చేసినప్పటికీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ టాప్ రిక్రూటర్‌గా నిలిచింది. ఇంకా మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్, ఇ-కామర్స్, ఆపరేషన్స్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లాంటి ఇతర ప్రధాన రంగాల్లో ఇక్కడి విద్యార్థులకు నియామకాలు లభించాయి. కోక్, ఉబెర్, ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెటింగ్, ఆపరేషన్స్, జనరల్ మేనేజ్మెంట్లో రిక్రూట్మర్లుగా ఉన్నారు. మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్, ఇ-కామర్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి ఇతర ప్రధాన రంగాల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించాయి. 2017 అక్టోబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 77 బిజినెస్ స్కూల్స్‌కు మాత్రమే అక్రిడిటేషన్ ఉంది. -
కోల్‌కతా ఐఐఎంలో కొలువుల జాతర
కోల్‌కతా: ఈ సంవత్సరంలో ఈ-కామర్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఐఐఎం కోల్ కతాలో నిర్వహించబోయే క్యాంపస్ ప్లేస్ మెంట్ విభాగంలో మరో రెండున్నర రోజుల్లో 2013-15 బ్యాచ్ ఈ-కామర్స్ విద్యార్థులకు 100 శాతం ప్లేస్ మెంట్లు రాబోతున్నాయి. మొత్తం 438 సీట్లున్న ఈ-కామర్స్ విభాగంలో 47 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మందికి క్యాంపస్ ప్లేస్ మెంట్లు దక్కనున్నాయని కోల్ కతా ఐఐఎం ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్, స్పాన్ డీల్, ఫ్లిప్ కార్ట్, ఓలాకేబ్స్, గ్రూప్ ఆన్, క్వికర్, అర్బన్ లాడర్, కార్ ట్రేడ్ వంటి పలు కంపెనీలు క్యాంపస్ ప్లేస్ మెంట్లు నిర్వహించనున్నాయి. ఒక్క ఫైనాన్స్ విభాగంలోనే 100కు పైగా విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందనున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, గోల్డ్ మేన్ సాచ్స్, సిటీబ్యాంక్, బిఎన్పీ పరిబాస్, డచ్ బ్యాంక్, అవెండస్ కాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ ఐబీడీ, ఎడెల్వీస్, అలీగ్రో అడ్వైజర్స్ ఇంకా మరికొన్ని ఫైనాన్స్ సంస్థలు మొదటి రోజు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయని ఐఐటీ కోల్ కతా ప్రకటించింది. ఒక్క కన్సల్టింగ్ విభాగంలోనే దాదాపు 20 శాతం మంది ఉద్యోగాలు పొందనున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, బైన్ అండ్ కో, మెక్కిన్సే, ఏటీ కియర్నీ, అసెంచర్ మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ కంపెనీలు ఈ విభాగంలో ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం 18 ఆఫర్లలో అసెంచర్ దే అగ్రభాగం. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలు 19 శాతం ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. పి అండ్ జీ, రెకిట్ బెన్ కిసర్, కెలాగ్స్, ఐటీసీ, ఫిలిప్స్, కోకాకోలా, పెప్సికో, మాండెలెజ్, డాబర్, అల్షాయా రిక్రూటెడ్ పీపీఓ కంపెనీలు ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి.