ఐఐఎం కోలకతా విద్యార్థుల అరుదైన ఘనత

Niti Aayog to recruit five IIM Calcutta students - Sakshi

కోలకతా: ఐఐఎం విద్యార్థులంటే.. నైపుణ్యాలకు  ప్రతిభాపాటవాలకు పెట్టిందిపేరు.   అందుకే  టాప్‌ కంపెనీలు వారిని రిక్రూట్‌ చేసుకునే విషయంలో ముందు వరసలో ఉంటాయి.   తాజాగా  ప్రఖ్యాత మేనేజ్మెంట్ సంస్థ కోలకతా ఐఐఎం విద్యార్థులు  అరుదైన  ఘనతను సాధించారు.  దేశంలో మొట్టమొదటి ట్రిపుల్ క్రౌన్  అక్రిడిటేషన్‌ పొందిన   కోలకతా మేనేజ్‌మెంట్‌  సంస్థ ఈ ఏడాది  వంద శాతం ప్లేస్‌మెంట్‌ నమోదు చేసింది. ముఖ్యంగా 180 టాప్‌  కంపెనీలతో సహా,  నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (నీతి ) ఆయోగ్ మొదటిసారిగా ఈ క్యాంపస్‌ను సందర్శించి, అయిదుగురు  ఐఐటీ విద్యార్థులను ఎంపిక చేయడం విశేషం.

2017-2019 బ్యాచ్ లోని మొత్తం విద్యార్థులను  నీతి ఆయోగ్‌, వివిధ టాప్‌  కంపెనీలు  భారీ ఆఫర్లతో ఎంపిక చేసుకున్నాయని ఐఐఎం కోలకత్తా వెల్లడించింది.  వేర్వేరు రంగాల్లోని 180 సంస్థలు వేసవి నియామకాలకు ఐఐఎం కలకత్తాకు వచ్చాయని తెలిపింది. ముఖ్యంగా  గోల్డ్‌మాన్‌ సాచ్స్, కోక్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి)  లాంటి  తమ బిజినెస్ స్కూల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయగా,  

మొత్తం బ్యాచ్లో 41 శాతం,188 ఆఫర్లు ఆర్థిక, కన్సల్టింగ్ రంగాల నుండి వచ్చాయి. ఫైనాన్స్‌ విభాగంలో గోల్డ్‌మేన్‌ సాచ్స్‌ అత్యధిక ఆఫర్లను ఆఫర్ చేసినప్పటికీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ టాప్‌ రిక్రూటర్‌గా నిలిచింది. ఇంకా మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్, ఇ-కామర్స్, ఆపరేషన్స్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లాంటి ఇతర ప్రధాన రంగాల్లో ఇక్కడి విద్యార్థులకు నియామకాలు లభించాయి. కోక్, ఉబెర్, ఆదిత్య బిర్లా గ్రూప్ మార్కెటింగ్, ఆపరేషన్స్, జనరల్ మేనేజ్మెంట్లో రిక్రూట్మర్లుగా ఉన్నారు. మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్, ఇ-కామర్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి ఇతర ప్రధాన రంగాల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించాయి. 2017 అక్టోబర్ నాటికి  ప్రపంచ వ్యాప్తంగా 77 బిజినెస్‌ స్కూల్స్‌కు మాత్రమే అక్రిడిటేషన్‌ ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top