'దటీజ్‌ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..! | Sapna Ghosh Raydas teach children for last 10 years without any salary | Sakshi
Sakshi News home page

'దటీజ్‌ సప్నా': చెదిరిపోయిన కలను సేవతో సాకారం చేస్తోంది..!

Sep 13 2025 10:02 AM | Updated on Sep 13 2025 10:21 AM

Sapna Ghosh Raydas teach children for last 10 years without any salary

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా వీధుల్లో సాదాసీదాగా ఉండే ఒక వృద్ధ మహిళ ఒక ముతక సంచీ భుజాన వేసుకుని షేరింగ్‌ ఆటోలో ప్రయాణిస్తుండటం కనిపిస్తుంది. ఆమె వయసు 70 ఏళ్లు, అయితేనేం.. ఉత్సాహంలో.. చురుకుదనంలో పాతికేళ్ల యువతీ యువకులతో పోటీ పడుతోందామె. స్కూల్‌ టీచర్‌గా పుష్కరం క్రితం రిటైరైందామె. ప్రభుత్వం వారిచ్చే పెన్షన్‌ తీసుకుంటూ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా... ఈ వయసులో మీరు ఇంత శ్రమ తీసుకోవడం అవసరమా? అనడిగితే... 

‘‘చదువుకోవాలని కొండంత కోరిక ఉన్నా, బోలెడంత డబ్బు పెట్టి చదువు కొనలేక నిరుత్సాహంతో నీరసపడిపోయే నిరుపేద పిల్లలకు నాకు తెలిసిన నాలుగు అక్షరం ముక్కలు నేర్పి, వారి కాళ్ల మీద వాళ్లను నిలబడేలా చేయాలన్న నా కలే నాకు ఉత్సాహాన్నిస్తోంది’’ అంటుందామె. ఆమె సప్నా ఘోష్‌ రాయదాస్, గత పదేళ్లుగా ఆమె జీతం లేకుండా గణితం, సైన్సుబోధిస్తోంది.

ఆమె 2015లో ఉద్యోగ విరమణ చేసినప్పటినుంచి ఇంట్లో కూర్చోవడానికి బదులుగా, ఆమె ప్రతిరోజూ 7 కిలోమీటర్లు ప్రయాణించి మరీ మారుమూలన ఎక్కడో నిరుపేదల కోసం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఆ పాఠశాలకు వెళ్లి, గణితం, సైన్స్‌ బోధించాలనుకుంది. ఎందుకంటే ఆమెకు అందులోనే శాంతి, విశ్రాంతి కూడా.

సప్నాకు సొంత పిల్లలు లేరు, కానీ ఆమె బోధించిన పిల్లలు వీధిలో ఆమెను చిరునవ్వుతో పలకరించి ఆమె పాదాలను తాకినప్పుడు, ఆమె హృదయం గర్వం, ఆనందంతో నిండిపోతుంది. ‘చిన్నప్పటినుంచి డాక్టర్‌ కావాలని కలలు కనేదాన్ని, కానీ మా ఇంటి పరిస్థితులు నన్ను టీచర్‌ కావడానికి దారితీశాయి. నా విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు కావడం చూసినప్పుడు, నేను చేసినది నా కల కంటే గొప్పదని నాకు అనిపిస్తుంది.‘ అంటున్న సప్న రాయ్‌ అందరికీ స్ఫూర్తిదాయకం.       

(చదవండి:  లిటిల్‌ పొయెట్‌..!  )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement