పశ్చిమ బెంగాల్: బెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమబెంగాల్‌లో శనివారం ఆయన వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం సభలో ప్రధాని మాట్లాడుతూ. పేద, మధ్య తరగతి ప్రజలంటే మమత సర్కార్‌కు లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో అభివృద్ధికి మమతా బెనర్జీనే పెద్ద అడ్డంకి అంటూ మండిపడ్డారు.
కేంద్ర నిధులను సైతం టీఎంసీ సర్కార్ పక్కదారి పట్టించిందని.. బెంగాల్ ప్రజల్ని మమత సర్కార్ లూటీ చేస్తోందంటూ ఆరోపించారు. మమత ప్రభుత్వం బెంగాల్‌లో అభివృద్ధిని కోరుకోవడం లేదు. మమత సర్కార్ అన్నిరంగాల్లో అవినీతిలో కూరుకుపోయింది. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం. పశ్చిమబెంగాల్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. బెంగాల్‌లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


