
మమతా బెనర్జీ అధినాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తీవ్ర కలకలం రేగింది. స్టూడెంట్ వింగ్ లీడర్ రాజన్యా హల్దార్(Rajanya Haldar) సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. తన మార్ఫింగ్ ఫొటోల వ్యవహారం వెనుక టీంఎసీవాళ్లే ఉన్నారని రాజన్య ఆరోపించగా.. టీఎంసీ ఆ ఆరోపణలకు స్పందించింది.
టీఎంసీ స్టూడెంట్ వింగ్ లీడర్(TMCP) అయిన రాజన్య హల్దార్.. గతంలో జాదవ్‌పూర్ వర్సిటీకి ప్రెసిడెంట్‌గా పని చేశారు. కిందటి ఏడాది ఓ షార్ట్ ఫిల్మ్ కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దీంతో టీఎంసీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తాజాగా కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఉదంతంపైనా ఆమె ఓ టీవీ షోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఘటనను ఖండించిన ఆమె.. విద్యార్థి నాయకుల్లోని దురుద్దేశాలను, నేరస్వభావాన్ని ఈ కేసు బయటపెట్టిందంటూ ప్రధాన నిందితుడు, టీఎంసీ స్టూడెంట్ మాజీ లీడర్ మోనోజిత్ మిశ్రాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారామె. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన రోజు నుంచే ఆమె పేరిట అశ్లీల చిత్రాలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలైంది. దీంతో కోల్‌కతా సైబర్ పోలీసులను ఆశ్రయించారామె.

తన డీప్‌ఫేక్ న్యూడ్ ఫొటోలను వైరల్ చేస్తోంది టీఎంసీ వాళ్లేనని ఆరోపిస్తున్నారామె. ‘‘ఉద్దేశపూర్వకంగానే పార్టీలో ఉన్న జూనియర్ లీడర్లు కొందరు ఏఐ సాయంతో నా డీప్‌ఫేక్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానం గనుక తన వివరణ తీసుకుని దర్యాప్తు జరిపిస్తుందని మాటిస్తే.. వాళ్ల పేర్లను వెల్లడించేందుకు తాను సిద్ధమని ప్రకటించింది.
అదే సమయంలో ఫేస్‌బుక్‌లోనూ ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘ఇది నా ప్రతిష్టను దెబ్బ తీయడానికే విద్యార్థి విభాగంలో కొందరు చేసిన పని. నా పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నేను ఈ నాటకాలు ఆడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. ఏది సత్యమో నిర్ణయించాల్సింది ఇక చట్టమే’’ అని అన్నారామె.
కోల్‌కతాలోని వివిధ లొకేషన్ల నుంచి ఆ ఫొటోలు షేర్ అయ్యాయి. ఈ ఫేక్ ఫొటోలతో తనను బద్నాం చేయడం మాత్రమే కాదు.. టీఎంసీ విద్యార్థి విభాగంలోని యువతుల్లో కొందరిని పదవుల ఆశ చూపించి లొంగదీసుకునే ప్రయత్నం కూడా అని ఆరోపించారామె. అయితే ఈ వ్యవహారంపై టీఎంసీ స్పందించింది. ఈ విషయాన్ని రాజన్య తమకు దృష్టికి తేలేదని.. ఒకవేళ తగిన ఆధారాలతో సంప్రదిస్తే విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీనియర్ నేత, మంత్రి ఫిర్హద్ హకీమ్ చెబుతున్నారు.
రాజన్య హల్దార్ టీఎంసీ విద్యార్థి విభాగం సహచరుడు, ఫిల్మ్ మేకర్ అయిన ప్రాంతీక్ చక్రవర్తిని కిందటి ఏడాది వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ పొలిటికల్ థీమ్‌తో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్జీకర్ దారుణ ఘటన ఉదంతాన్ని పోలిన షార్ట్ ఫిలింలో ఆమె నటించారు. ఇది దుమారం రేపడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఇదిలా ఉంటే.. రాజన్య భర్త ప్రాంతీక్ పార్టీలోకి తీసుకొచ్చిన కొందరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు లా స్టూడెంట్ అత్యాచార ఉదంతంలో అరెస్ట్ అయిన మోనోజిత్ మిశ్రాకు ప్రాంతీక్‌కు అత్యంత సన్నిహితుడు ఈ ఎపిసోడ్‌లో మరో కోసమెరుపు.
ఇదీ చదవండి: యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్