
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కలకలం. వరద బాధితుల్ని పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలపై సుమారు 500 మంది దాడికి తెగబడ్డారు. చేతికి దొరికిన మారణాయుధం, చెప్పులు, కర్రలు, రాళ్లతో దాడికి దిగాయారు. కమలం నేతలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇక నిందితులు జరిపిన దాడిలో బీజేపీ ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ధరించిన కుర్తా సైతం రక్తంతో తడిసి ముద్దైంది. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేశాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలో అక్టోబర్ 4న రాత్రి కురిసిన ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందినట్లు సమాచారం. మిరిక్, కుర్సియాంగ్ ప్రాంతాల్లో దూదియా ఐరన్ బ్రిడ్జి కూలిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది.
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఖాగెన్ ముర్ము,అదే నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ ఘోష్,బీజేపీ బెంగాల్ యూనిట్ చీఫ్ సమ్మిక్ బట్టాచార్య సోమవారం (అక్టోబర్6) జల్‌పైగురి జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల్ని పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేశారు.
ఆ సమయంలో సుమారు 500 మంది మారణాయుధాలతో బీజేపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. వారిని బయపెట్టేందుకు ఎంపీ ఖాగెన్ ముర్ముపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఆ దాడిలో ఖాగెన్ ముర్ముతోపాటు ఇతర బీజేపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు.
దాడిలో గాయపడి నొప్పి తాళలేక హాహాకారాలు చేస్తున్న కమలం నేతల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బీజేపీ శ్రేణులు ఆస్పత్రికి తరలించాయి. . ప్రస్తుతం వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. ఆ దృశ్యాలు వెలుగులోకి రావడంతో బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
వరద బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలపై దాడి జరిగింది. వరద బాధితుల్ని రక్షించేందుకు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కానీ టీఎంసీ ఇతర నేతలు ముందుకు రాలేదు. కానీ వరద బాధితుల్ని అండగా నిలిచేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులపై దాడి చేయడం హేయం అంటూ ఖండించారు. ఇది టీఎంసీ బెంగాల్. ఇక్కడ క్రూరత్వం పాలిస్తుంటే.. కరుణ చూపితే శిక్షపడుతోందన్నారు.
BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.
This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK— Sandipan Mitra (@SMitra_) October 6, 2025