West Bangal CM mamata banerjee
-
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయని ‘యాక్సిస్ మై ఇండియా’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది.తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్‌ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. -
మమతతో కట్.. లెఫ్ట్‌తో బ్రేక్: కాంగ్రెస్ సరికొత్త గేమ్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్‌కు తెరదించుతూ, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంచలన ప్రకటన చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇకపై కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసిన రెండు రోజులకే కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర అగ్రనేతలతో రాష్ట్ర నాయకులు చర్చించిన అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.సీట్ల సర్దుబాటుపై పేచీఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో తలెత్తిన విభేదాలే కాంగ్రెస్-టీఎంసీలు విడిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామన్న టీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రెండు స్థానాల కోసం పొత్తు పెట్టుకోవడం కంటే, అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడమే పార్టీకి శ్రేయస్కరమని ఏఐసీసీ ఇన్చార్జ్ గులాం అహ్మద్ మీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.గత అనుభవాల మేరకు..గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ సాహసోపేత నిర్ణయానికి వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు 44 స్థానాల్లో విజయం సాధించి 12.25 శాతం ఓట్ల వాటాను పొందిన కాంగ్రెస్, 2021 నాటికి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడమే కాకుండా, ఓట్ల శాతం 3 శాతానికి పడిపోవడం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. పొత్తుల కారణంగా సొంత బలాన్ని కోల్పోతున్నామనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా నాటుకుపోయింది.వామపక్షాలతోనూ..మరోవైపు, ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న వామపక్షాలతో కూడా కాంగ్రెస్ బంధాన్ని తెంచుకుంది. గత వైఫల్యాలను అంగీకరిస్తూ, భవిష్యత్తులో పార్టీ మనుగడ సాగించాలంటే సొంతంగా ఎదగడం తప్ప మరో మార్గం లేదని పరిశీలకుడు సుదీప్ రాయ్ బర్మన్ పేర్కొన్నారు. బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ కూడా తాము దీర్ఘకాలిక ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇప్పుడే ప్రకటించకుండా, ఎన్నికల ఫలితాల తర్వాతే తేల్చాలని పార్టీ నిర్ణయించింది.ఓటు బ్యాంకు లేదని..కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ ఒక భారం అని, దానికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు లేదని సీపీఐ(ఎం) ఎద్దేవా చేసింది. బీజేపీ, టీఎంసీ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, తెర వెనుక మమతా బెనర్జీతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోందని మహ్మద్ సలీం ఆరోపించారు. ఈ విమర్శలతో విపక్షాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు బహిర్గతమయ్యింది.చివరికి ఎవరికి లబ్ధి?మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ఒంటరి పోరుతో బెంగాల్ ఎన్నికల క్షేత్రం ఆసక్తికరంగా మారింది. ఇటు అధికార టీఎంసీ, అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు విడివిడిగా బరిలోకి దిగుతుండటంతో చతుర్ముఖ పోటీ ఖాయమైంది. ఈ ఓట్ల చీలిక ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? మమతా బెనర్జీ తన కోటను కాపాడుకుంటారా? లేక కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటుందా? అనేది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇది కూడా చదవండి: పుతిన్‌తో భేటీకి ఎప్స్టీన్ తహతహ? షాకిస్తున్న తాజా పత్రాలు.. -
మైకుల్లో కాదు ‘మెటా’లో..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అప్పుడే తమ పోరాట క్షేత్రాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ వేదికలకు తరలించాయి. ‘మెటా’, గూగుల్ యాడ్ ట్రాన్స్పరెన్సీ లైబ్రరీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇటీవల ‘ఇండియా టుడే’ బృందం విశ్లేషించింది. ఈ నివేదికలోని వివరాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి జనవరి 16 మధ్య సాగిన డిజటల్ యుద్ధం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.నెల రోజులకు రూ. 6.38 కోట్లుగడచిన నెల రోజుల వ్యవధిలో బెంగాల్‌లోని రాజకీయ పార్టీలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్‌లలో ప్రకటనల కోసం ఏకంగా రూ. 6.38 కోట్లు వెచ్చించాయి. ఈ డిజిటల్ ప్రకటనల ఖర్చుల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రధాని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.ప్రకటనల్లో టీఎంసీ జోరుతృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహకర్త ‘ఐ-ప్యాక్’ (ఐ-పాక్)తో కలిసి గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల కోసం గత నెలలో సుమారు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసింది. కేవలం అధికారిక పేజీలే కాకుండా.. ‘అబర్ జీత్బే బంగ్లా’, ‘అమీ బంగ్లార్ డిజిటల్ జోద్ధా’ లాంటి పలు సరోగెట్ (అప్రత్యక్ష) పేజీల ద్వారా మరో రూ. 32 లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది.మమతా బెనర్జీకి అనుకూలంగా..ఈ పేజీలలో పార్టీ గుర్తును నేరుగా వాడకపోయినప్పటికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘బోల్చే బంగ్లా’ లాంటి పేజీలు ఒకడుగు ముందుకు వేసి, బీజేపీపై పలు విమర్శలు చేస్తూ, ఇందుకు ప్రయాగ్‌రాజ్ మాఘ మేళా వీడియోలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీపై వ్యూహాత్మక దాడులకు దిగాయి.అధికారిక ప్రచారంలో బీజేపీపశ్చిమ బెంగాల్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెటాపై రూ. 72 లక్షలు, గూగుల్‌పై రూ. 63 లక్షలు వెచ్చించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి సరోగెట్ పేజీల కంటే అధికారిక ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా తమ పథకాల ప్రచారం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నెల రోజుల్లో రూ. 2.1 కోట్లు ఖర్చు చేసింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ సుమారు రూ. 19 లక్షలు వెచ్చించింది.బెంగాల్ కోటలో సమరభేరిదేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారం సాగించడంలో బీజేపీకి తిరుగులేకపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌ను మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి గణాంకాలను పరిశీలించినా టీఎంసీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రచార శైలిని చూస్తే, టీఎంసీ గూగుల్ యాడ్స్ ద్వారా విధానపరమైన ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బీజేపీ ‘మెటా’ వేదికలపై భావోద్వేగపూరిత అంశాలను ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుండగా, పటిష్టమైన వ్యూహాలతో టీఎంసీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్ -
ఈడీ దాడుల మధ్య ఐప్యాక్ చీఫ్ ఇంటికి హుటాహుటీన వెళ్లిన మమతా బెనర్జీ
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ- టీఎంసీల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరింది. పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ చర్యతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పలు డాక్యుమెంట్లను పరిశీలించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈడీ అధికారుల విధులకు అడ్డుపడుతున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తూ, మమతా చర్యలను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ నేతలు..సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈడీ అధికారుల పనిలో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధం అని ఆరోపించారు. కేంద్ర సంస్థల పనులను అడ్డుకోవడం ద్వారా టీఎంసీ తమపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తోందని వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీకి వ్యూహరచన, ప్రచార పద్ధతులు, డేటా విశ్లేషణ వంటి అంశాలను ఐప్యాక్ నిర్వహిస్తోంది. ఈడీ సోదాలు, మమతా బెనర్జీ జోక్యం, బీజేపీ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త హైడ్రామాకు దారితీశాయి. ఎన్నికల ముందు ఈ పరిణామాలు టీఎంసీ–బీజేపీ మధ్య పోరును మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రాణం తీసిన ‘ఓటరు జాబితా విచారణ’
కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రక్షాళన దిశగా నడుంబిగించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున ‘ఓటరు జాబితా విచారణ’ చేస్తోంది. అయితే ఇది అనుకోని ఘటనకు దారితీసింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూనే విచారణకు హాజరైన ఒక వృద్ధుడు కన్నుమూశాడు.పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లాకు చెందిన నజితుల్ మొల్లా(68) గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. గత డిసెంబర్ 20న ఆరోగ్యం క్షీణించడంతో కోల్‌కతాలోని ఒక ఆస్పత్రిలో చేరాడు. ఇంతలో 2002 నాటి ఓటరు జాబితాలో అతని పేరు లేదంటూ, ఓటరు జాబితా విచారణ అధికారులు అతనికి నోటీసులు పంపారు. దీంతో ఆయన ముక్కుకు ఆక్సిజన్ అందించే కాన్యులా గొట్టంతోనే డిసెంబర్ 31న ఎన్నికల అధికారులు చెప్పిన విచారణ కేంద్రానికి వెళ్లారు.విచారణ ముగించుకుని ఇంటికి చేరుకున్న మొల్లా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ విషయంలో ఆయన తీవ్ర ఆందోళన చెందారని, ఆ మానసిక ఒత్తిడే ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జనవరి 2న తిరిగి అదే ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఓటరు హక్కు కోల్పోతామనే భయంతో ఆయన ఆ గొట్టంతోనే అధికారుల విచారణకు వెళ్లారని, ఆ ఒత్తిడిని ఆయన తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.నజితుల్ మొల్లా మృతితో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడింది. రాష్ట్రంలో ఓటర్ల విచారణ ప్రక్రియ కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ఫలితంగా భయం,మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్యల కారణంగా 56 మంది వరకూ మరణించారని టీఎంసీ ఆరోపించింది. ఇది పేద ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాస్తూ, ఈ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు! -
బీజేపీ నేతలపై మూక దాడి
నగరాకాటా: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యట నకు వెళ్లిన సమయంలో జరిగిన మూకదాడిలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే గాయాల పాలయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లా నగరాకాటా వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుఆర్ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, అందుతున్న సాయాన్ని పరిశీలించేందుకు బీజేపీ ఏర్పాటు చేసిన బృందంలో ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ఉన్నారు. వరద బాధితుల దగ్గరికి వెళ్తున్న ఆ నేతల కాన్వాయ్‌ని బమన్దాంగా వద్ద ఓ గుంపు చుట్టు ముట్టింది. ‘దీదీ, దీ దీ..’అని నినాదాలు చేస్తూ వాహనాలపై వారు రాళ్లు రువ్వారు. వాహనాల కిటికీల అ ద్దాలు పగిలిపోయా యి. ముర్ము తలకు గాయమై రక్తం కారింది. భయంతో ఘోష్ వణికిపోయారు. ఇందుకు సంబంధించిన లైవ్ వీడియో ఫేస్బుక్లో ఉంది. దుండగులు తమను దూషిస్తూ వెనుక నుంచి రాళ్ల దాడికి దిగారని శంకర్ ఘోష్ చెప్పారు. ఖగేన్కు రాళ్లు తగలడంతో భయపడి సీటు వెనుక దాక్కున్నట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎంపీ ఖగేన్ను సిలిగురిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన టీఎంసీ ఆటవిక పాలనకు మరో నిదర్శనమంటూ బీజేపీ మండిపడింది. ఈ ప్రాంతంలో ప్రజల్లో రాజుకుంటున్న అసమ్మతిని అణచివేసేందుకే సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి చేయిస్తు న్నారని ఆరోపించింది. పోలీసుల సమక్షంలోనే తమ నేతల బృందంపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించింది. ఒక వైపు ప్రజలు వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంటే కోల్‌కతాలో సీఎం మమత మాత్రం ఉత్సవాలు చేసుకుంటున్నారని పేర్కొంది. ఇలా ఉండగా, సిలిగురిలోని వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు వెళ్లిన తమకు టీఎంసీ శ్రేణులు పదేపదే అడ్డు తగిలారని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆరోపించారు. తమ బృందంలో ఎంపీలు రాజు బిస్తా, జయంత రాయ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. BJP MP Khagen Murmu (Malda Uttar PC) and BJP MLA Shankar Ghosh (Siliguri AC) attacked in Nagrakata in Jalpaiguri.This seems to be a case of public outrage against BJP leaders of North Bengal who prioritize accompanying LOP Suvendu Adhikari over attending to their areas. pic.twitter.com/Rf5vnPGdlK— Sandipan Mitra (@SMitra_) October 6, 2025 -
ఎన్నికల కౌటింగ్ కేంద్రంలో పేలిన బాంబు.. నాలుగో తరగతి విద్యార్థిని మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ ఉద్రిక్తతకు దారి తీశాయి. సోమవారం కాళీగంజ్ నియోజక వర్గంలోని కౌంటింగ్‌లో నాటు బాంబు పేలి 10ఏళ్ల బాలిక మృతి చెందింది.తూర్పు నదియా జిల్లా బరోచాంద్ నగర్ గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఘటన జరిగే సమయానికి ఈ కేంద్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. ఆ సమయంలో కౌంటింగ్ కేంద్రంలో నాటు బాంబు పేలి నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక తమన్నా ఖాటూన్ తీవ్రంగా గాయపడింది.ఊహించని పరిణామంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. -
సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ
కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) దుమ్మెత్తి పోశారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్(trinamool congress)కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో సోమవారం తొలిసారి మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించారు.ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ..‘నిందితుల్ని ప్రోత్సహించవద్దు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసేలా ఇక్కడ (సందేశ్‌ఖాలీ) పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లడదలుచుకోలేదు. అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీ (sandeshkhali) స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అయినప్పటికీ తాజా పర్యటనలో ఆ ఆందోళనల్ని ప్రస్తావించలేదు. పరోక్షంగా వాటిని నేను ఎప్పుడో మరిచి పోయా. ఇక్కడి మహిళలు మోసగాళ్లను నమ్మకండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.సందేశ్‌ఖాలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించా. ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ ఖాలీని పర్యటిస్తారా? అని స్థానికులు నన్ను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యటనకు వస్తానని మాట ఇచ్చా. మాట ప్రకారం మీ ముందుకు వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానికులు ప్రయోజనం పొందుతున్నారా? లేదా? ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు, పురుషులు ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’అంటూ మమతా బెనర్జీ ఆకాంక్షించారు.సందేశ్‌ఖాలీ వివాదం ఏంటి?పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ అనే ప్రాంతంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన చేపట్టారు. మహిళల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులకే షాజహాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. -
బీజేపీ ‘సురక్షిత స్వర్గధామం’ వ్యాఖ్యలపై దీదీ, పోలీస్ శాఖ ఆగ్రహం
కోల్‌కతా : రామేశ్వరం కెఫే బాంబు పేలుడు అంశం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ తరుణంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. వెస్ట్‌బెంగాల్‌లోని రామేశ్వరం కెఫే బాండు పేలుడు కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను వెస్ట్ బెంగాల్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సురక్షిత స్వర్గధామంగా అయితే, వెస్ట్ బెంగాల్లో బాంబు బ్లాస్ట్ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంపై బీజేపీ.. అధికార పార్టీ టీఎంసీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ..‘‘రామేశ్వరం కెఫే పేలుడులో ఇద్దరు ప్రధాన నిందితులు, బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, సహచరుడు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాను కోల్‌కతాలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ కర్ణాటకలోని శివమొగ్గలోని ఐఎస్ఐఎస్ సెల్‌కి చెందిన వారు. దురదృష్టవశాత్తూ మమతా బెనర్జీ హయాంలో పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మారింది’’ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సంగతేంటి అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కూచ్‌బెహార్ దిన్హటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ.. రామేశ్వరం కేఫె బ్లాస్ట్ కేసులో అరెస్టయిన నిందితులు తమ రాష్ట్రం వారని కాదని, ఇక్కడ తలదాచుకున్నారని సూచించారు. అయినప్పటికీ ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన ఇద్దరు నిందితుల్ని రెండుగంట్లలోనే అరెస్ట్ చేశారని స్పస్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లు ఏమైనా సురక్షితంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. పోలీసుల పనితీరు అమోఘం ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ బీజేపీ వ్యాఖ్యల్ని ఖంఢించారు. బాంబు బ్లాస్ట్ కేసు నిందితుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాష్ట్ర పోలీసుల సహకారం వల్లే సాధ్యమైందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విషయం మీడియాలో వచ్చిందంటూ పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు ‘దేశ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో దృఢంగా ఉన్నారు’ ఇతర దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు. Falsehood at its worst! Contrary to the claims made by @amitmalviya, the fact is that, two suspects in the Rameshwaram Cafe blast case have been arrested from Purba Medinipur in a JOINT operation by the West Bengal Police and the Central Intelligence Agencies. (1/2) — West Bengal Police (@WBPolice) April 12, 2024 పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏమన్నారంటే మరోవైపు అమిత్ మాల్వియా వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ పోలీస్ విభాగం స్పందించింది. ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని, ఆ తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మరో ట్వీట్లో తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం కాదు. రాష్ట్ర పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు అని పోలీసులు ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్‌కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే! -
విపక్షాలకు మమత షాక్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం
కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండనుందని బాంబు పేల్చారు. ఈ ఓటింగ్‌కు తమ పార్టీ సభ్యులు గైర్హాజరవుతారని ప్రకటించింది టీఎంసీ. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయటంలో ఇతర విపక్షాల వైఖరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అదే సమయంలో.. టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు అభ్యంతరకరం. విపక్షాల అభ్యర్థికీ మేము మద్దతు ఇవ్వం. అందుకే ఓటింగ్‌కు మా పార్టీ సభ్యులు దూరంగా ఉంటారు.’ అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున జగదీప్ ధన్‌ఖడ్ పోటీ చేస్తున్నారు. బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన.. అనేక విషయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో తీవ్రంగా విభేదించారు. మరోవైపు.. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను బరిలోకి దింపాయి కాంగ్రెస్, ఎన్సీపీ సహా ఇతర పార్టీలు. శివసేన, జేఎంఎం వంటి పార్టీలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతు తెలపటమూ టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. ఇటీవలే గవర్నర్ దగదీప్ ధన్‌ఖడ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో మమతా బెనర్జీ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టు 6న ఓటింగ్.. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ఆగస్టు 6న జరగనుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10న ముగియనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేసేందుకు అర్హులే. ఇదీ చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి -
మోదీ తర్వాత ప్రధాని ఎవరు?
న్యూఢిల్లీ: ‘ఈ అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు చిత్తుకాగితాలతో సమానం’ అని గత మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కొద్ది మంది మినహా వారం రోజులుగా భారతదేశం మొత్తం బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తోంది. ఇటు నిత్యావసరాలైన పాల దగ్గర్నుంచి పెట్రోల్ బంకుల దాకా జనం బాధలు చెప్పుకుంటే రాంలీలా! ఇంతలోనే‘నా చర్యలతో పేదవాడు ప్రశాంతంగా నిద్రపోయాడు’ అంటూ ప్రధాని చేసిన విలోమ ప్రకటన. వీటన్నింటి నేపథ్యంలో ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార పార్టీకి చావుదెబ్బ తప్పదు’ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఇలా(అర్ధాంతరంగా ఎన్నికలు జరిగే) అవకాశం నూటికి నూరుపాళ్లు లేనప్పటికీ ఒక ప్రధాన పార్టీలో మాత్రం ‘భావి ప్రధాని’ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణాలు ఆ చర్చకు మరింత బలాన్నివ్వడమేకాక మోదీ తర్వాత ప్రధాని ఎవనే ఆసక్తిని రెట్టింపుచేశాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో నోట్ల రద్దుతో జనం పడుతోన్న ఇబ్బందులే ప్రధాన ఆయుధంగా విపక్షాలు మోదీ సర్కారుపై యుద్ధం చేయనున్నాయి. నోటు పాట్లతోపాటు సర్జికల్ దాడులు, కశ్మీర్ పరిస్థితి, ఓఆర్ఓపీ, రైతు సమస్యలపైనా ప్రతిపక్షాలు ప్రశ్నల దాడి చేయనున్నాయి. ఎన్డీఏ అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఒకే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఏకతాటి నిర్ణయానికి వచ్చింది ఒక్క ‘నోట్ల రద్దు’ విషయం లోనేకావడం గమనార్హం. ఆ మేరకు మోదీ వ్యతిరేక గళాలన్నీ ఒకే రాగం ఆలపించేలా చేసిన ఘనత తమ అధినేత్రికే దక్కుతుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేయడంలో తలెత్తిన ఇబ్బందులపై మాత్రమే మాట్లాడుతూ, (రద్దు)నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న పార్టీగా కాంగ్రెస్‘నోట్ల రద్దు వ్యతిరేక’ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకురాలేదు. అదేసమయంలో మోదీ నిర్ణయాన్ని మొదటి రోజు నుంచే ఖండిస్తోన్న పశ్చిమ బంగా సీఎం మమత నాయకత్వానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు కనిపించింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాష్ట్రపతిభవన్ వరకూ విపక్షాలన్నీ మార్చ్ నిర్వహించాలన్న మమత ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ మొదట తలొగ్గినా తర్జనభర్జనల తర్వాత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇంకో రెండున్నరేళ్లు కొనసాగించాల్సిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తాత్కాలిక అవసరం కోసం మమత వలలో పడటం భవిష్యత్తుకు ప్రమాదమని భావించడం వల్లే కాంగ్రెస్ మమతతో కలిసి మార్చ్ చేయడానికి వెనకడుగు వేసి ఉంటుందని విశ్లేషకుల భావన. చివరికి పార్లమెంటులో మాత్రమే అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాగా మమత నేతృత్వంలో జరగనున్న మార్చ్ కు అనూహ్యరీతిలో బీజేపీ మిత్రపక్షం శివసేన అంగీకరించింది. వీరితోపాటు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కలిసి నడవనున్నారు. కీలక పార్టీలైన జేడీఎస్, జేడీయూ, డీఎంకే, ఆర్జేడీలు కూడా మమతకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. మమత అనూహ్యంగా ఢిల్లీలో మెరిసిపోతుండటంతో ఉత్సాహభరితులైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ప్రెస్ మీట్లు పెట్టిమరీ ‘కాబోయే ప్రధాని మమతానే’ అనీ, ‘మోదీ తర్వాత దీదీనే’ అనీ ప్రకటనలు చేశారు. ఆ పార్టీకే చెందిన కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లొస్తాయనే లెక్కలు చదివారు. ఆయన ఊహ ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేవు. 42 ఎంపీ స్థానాలను గెలుచుకుని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా అవతరిస్తుంది. లాలూ, నితీశ్ లు తలో పాతిక సీట్లు, నవీన్ పట్నాయక్ బీజేడీ 20, డీఎంకే లేదా ఐఏడీఎంకేకి 40 సీట్లు, ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి 30 సీట్లు, మాయావతి బీఎస్పీకి 30 సీట్లు వస్తాయని, మిగతా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతే మమతా బెనర్జీ సులువుగా ప్రధానమంత్రి కాగలరని ముకుల్ రాయ్ జోస్యం చెప్పారు.


