కోల్‌కతా: బీజేపీ-ఈసీ టార్గెట్‌గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపణలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతునన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) లో ఇప్పటివరకూ 54 లక్షల ఓటర్లను తొలగించారని మండిపడ్డారు. ప్రస్తుతం ‘సర్’ ఇంకా ఓటర్ల జాబితా సవరణ చేస్తున్న క్రమంలో కోటి వరకూ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విషయం అర్దమవుతుందన్నారు. బీజేపీ తయారు చేసిన ఏఐ టూల్స్‌ను ఈసీ వాడటం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతుందని మండిపడ్డారు.
తొలగించబడిన ఓటర్లలో మహిళలు, మైనార్టీలు, పేదలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారన్నారు. 2002 నాటి పాత ఓటరు జాబితాలను డిజిటైజ్ చేయడానికి బీజేపీ రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ వాడటం వల్ల తప్పులు జరగుతున్నాయని మమతా స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో చేసిన సవరణలను పట్టించుకోకుండా, ప్రజలు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ తొలగింపులు బీజేపీ వ్యూహంలో భాగమని, టీఎంసీ ఓటర్లను బలహీనపరచడమే లక్ష్యంగా ఉందన్నారు.


