breaking news
engulfed
-
‘ఏమీ కనిపించడంలేదు’.. ఢిల్లీ ప్రజల గగ్గోలు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు శీతల గాలుల తీవ్రత కొనసాగుతుండగా, మరోవైపు సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో విజిబిలిటీ (దృశ్యమానత) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా అక్షరధామ్, ధౌలాకువాన్ వంటి కీలక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించని పరిస్థితి ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. #WATCH | Delhi wakes up to a layer of dense fog in some parts of the city this morning. Visuals from Mahipalpur, near IGI Airport. As per IMD, the area is experiencing 'Moderate Fog' today. AQI in the area recorded at '134' in 'moderate' category, as claimed by CPCB. pic.twitter.com/kSHcsZoBIa— ANI (@ANI) February 2, 2026విపరీతమైన పొగమంచు కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)హై అలర్ట్ ప్రకటించింది. విమానాల రాకపోకల్లో జాప్యం తప్పదని ఎయిర్పోర్ట్ యంత్రాంగం తెలిపింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించింది. కాగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.#WATCH | Delhi wakes up to a layer of dense fog in some parts of the city this morning. Visuals from Mother Teresa Crescent Marg. As per IMD, the area is experiencing 'Moderate Fog' today. AQI in the area recorded at '118' in 'moderate' category, as claimed by CPCB. pic.twitter.com/svtkviu5sd— ANI (@ANI) February 2, 2026శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 6.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే 1.7 డిగ్రీలు తక్కువ. పాలం (8.1°C), లోధి రోడ్ (7.1°C), అయానగర్ (6.6°C) వంటి ప్రాంతాల్లో కూడా తీవ్రమైన చలి వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో పొగమంచు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం కలవరపెడుతోంది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)318గా నమోదై ‘అత్యంత పేలవమైన’ (Very Poor) విభాగంలో కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: పొద్దున్నే వణికించిన భూకంపం -
ట్రక్కు డ్రైవర్ ఎంత పనిచేశాడు...
గత నెల రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చైనాలోని నదులు పొంగి పొర్లుతున్నాయి. చైనా వాసులకు మందస్తు హెచ్చరికల్లో భాగంగా గతంలో జరిగిన ఓ దుర్ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో ఏముందంటే.. నదిలో నీటి తీవ్రతను అంచనా వేయలేకపోయిన ఓ ట్రక్కు డ్రైవర్ త్వరగా తన గమ్యస్థానాన్ని చేరాలని భావించాడు. నీరు బ్రిడ్జ్ పైనే ప్రవహిస్తున్నా ఏమీ కాదులే అనుకొని తొందరపాటూతో ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ట్రక్ అదుపు తప్పింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా నీటి ఉదృతి ముందు ఏమీ చేయలేకపోయాడు. తొందరగా బ్రిడ్జ్ దాటుదామని అనుకున్న డ్రైవర్ ట్రక్కుతో సహా నీటిలో పూర్తిగా మునిగిపోయాడు. ఈ దుర్ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.


