ట్రక్కు డ్రైవర్ ఎంత పనిచేశాడు... | Chinese truck driver engulfed by floods goes viral | Sakshi
Sakshi News home page

ట్రక్కు డ్రైవర్ ఎంత పనిచేశాడు...

Jul 4 2016 5:00 PM | Updated on Aug 13 2018 3:45 PM

ట్రక్కు డ్రైవర్ ఎంత పనిచేశాడు... - Sakshi

ట్రక్కు డ్రైవర్ ఎంత పనిచేశాడు...

గత నెల రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చైనాలోని నదులు పొంగి పొర్లుతున్నాయి.

గత నెల రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చైనాలోని నదులు పొంగి పొర్లుతున్నాయి. చైనా వాసులకు మందస్తు హెచ్చరికల్లో భాగంగా గతంలో జరిగిన ఓ దుర్ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో ఏముందంటే.. నదిలో నీటి తీవ్రతను అంచనా వేయలేకపోయిన ఓ ట్రక్కు డ్రైవర్ త్వరగా తన గమ్యస్థానాన్ని చేరాలని భావించాడు. నీరు బ్రిడ్జ్ పైనే ప్రవహిస్తున్నా ఏమీ కాదులే అనుకొని తొందరపాటూతో ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకున్నాడు.

కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ట్రక్ అదుపు తప్పింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా నీటి ఉదృతి ముందు ఏమీ చేయలేకపోయాడు. తొందరగా బ్రిడ్జ్ దాటుదామని అనుకున్న డ్రైవర్ ట్రక్కుతో సహా నీటిలో పూర్తిగా మునిగిపోయాడు. ఈ దుర్ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement