నేను ఆపకపోతే అణ్వాయుధ దాడి జరిగేది
భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను
కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను
మళ్లీ పాతపాటే పాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి అన్నారు. రెండు దేశాలు అణు యుద్ధానికి సిద్ధమయ్యాయని, ఆ యు ద్ధాన్ని ఆపి తాను లక్షలాది మంది ప్రాణాలు కాపాడానని చెప్పారు. పది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత తనదని చెప్పుకొ చ్చారు. తన రెండవ పదవీకాలం వార్షికోత్స వం సందర్భంగా ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. తనను కలిసిన పాక్ ప్రధాని ‘మిస్టర్ ట్రంప్.. మీరు కోటి మంది, అంతకంటే ఎక్కువ మంది ప్రాణాలే కాపాడారు’ అని చెప్పారనన్నారు.
మిగిలిన దేశాల యుద్ధాల వల్ల నష్టపోయేది లక్షలాది మందేనని, కానీ భారత్, పాకిస్తాన్ లో మాత్రం కోటి, కోటిన్నర, రెండు కోట్లు, అంతకంటే ఎక్కువ జనాభా కూడా అయి ఉండొచ్చన్నారు. ఇది చాలా పెద్ద విషయమ ని చెప్పారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతోనే ఆగిందని గతేడాది మే 10న ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అదే విషయాన్ని సుమారు 90 సార్లు పేర్కొన్నారు. అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశానికి వెళ్లినా ఈ వాదనను పదేపదే ముందుకు తెస్తున్నారు.
‘365 రోజుల్లో 365 విజయాలు’
ట్రంప్ 2.0 మొదటి ఏడాదిలో సాధించిన విజయాల సమగ్ర సంకలనాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. ‘365 రోజుల్లో 365 విజయాలు’ పేరుతో విడుదల చేసిన ఆ ప్రకటన ఆధునిక అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడి పదవీకాలంలో సాధించని అద్భుతమైన విజయాలు అధ్యక్షుడు ట్రంప్ సాధించారని పేర్కొంది. వలసలు తగ్గించడం, హత్యల రేటు రికార్డు స్థాయిలో తగ్గటం, దేశంలోకి ట్రిలియన్ల కొద్దీ పెట్టుబడులు, యుద్ధాలు ముగించి శాంతి ఒప్పందాలు, రికార్డు స్థాయిలో ఇంధన ఉత్పత్తి, బ్యూరోక్రసీలో భారీకోతలు అన్నీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాఏ సాధ్యమ య్యాయని తెలిపింది.
అత్యవసరమైన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ట్రంప్ అమలు చేశారని, ఇది ప్రారంభం మ్రాతమేనని ప్రకటించింది. ట్రంప్ జనవరి 20, 2025న రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంవత్సరంలో సాధించిన విజయాల్లో ‘భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతిని నెలకొల్పడం’ కూడా ఉందని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్టు – ఇథియోపియా, అర్మేనియా – అజర్‌బైజాన్ మధ్య యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని కూడా ట్రంప్ అన్నారు. తాను సంఘర్షణను ముగించిన ప్రతి దేశంలోని నాయకులు నోబెల్ శాంతి బహుమతికి తననే నామినేట్ చేశారని చెప్పారు.
ఆ దేశాల నాయకులు తనకు బహుమతి ఇవ్వాలని కోరుతూ బలమైన సిఫార్సులను కూడా పంపారని ఆయన తెలిపారు. శాంతి బహుమతి గ్రహీతను ఎంపిక చేసే నార్వేజియన్ నోబెల్ కమిటీపైనా ఆయన మండిపడ్డారు. అధికారులు తమకు సంబంధం లేదని చెబుతున్నా, నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వాలనే అంశాన్ని నార్వేనే నిర్ణయిస్తుందని తాను భావిస్తున్నా న్నారు. ఆమెకు దక్కిన నోబెల్ శాంతి–2025 బహుమతిని తనకు అందజేసిన వెనిజువెలా ప్రతిపక్ష నాయ కురాలు మచాడోపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు. ఎనిమిది యుద్ధాలను ముగించినందుకు నోబెల్ బహుమతికి అర్హత మీకే ఉందని, ఆ బహుమతికి తాను అర్హురాలిని కాదని ఆమె చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.


