
మరణించారంటూ వదంతులు
ఇంటర్నెట్‌లో యమా ట్రెండింగ్
వైట్‌హౌస్ ‘అనుమానాస్పద’ మౌనం’
కొన్నాళ్లుగా ఆరోగ్యం అంతంతే!
గద్దెనెక్కేందుకు సిద్ధమన్న వాన్స్
నాటినుంచీ మరిన్ని ఊహాగానాలు
న్యూఢిల్లీ: ట్రంప్‌కేమైంది? ఆయన బాగున్నారా?అసలు బతికే ఉన్నారా? అమెరికా అధ్యక్షుడు మరణించారంటూ శనివారం ఉన్నట్టుండి పుకార్లు పుట్టా యి. చూస్తుండగానే ప్రపంచమంతటా కార్చిచ్చు వేగంతో వ్యాపించాయి. ఈ వైనమంతా ‘ట్రంప్ మరణించారు’ పేరిట ఇంటర్నెట్లో రోజంతా యమా ట్రెండింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 60 వేలకు పైగా పోస్టులు పుట్టుకొచ్చాయి.
గ్రోక్ తదితరాల్లోనైతే ఏకంగా 13 లక్షల మందికి పైగా ఈ విషయమై ఆరాలు తీశారు. నిజానికి 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం కొన్ని నెలలుగా అమెరికాలోనే గాక ప్రపంచమంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత జూలైలో ఆయన చేతికి గాయం, కాళ్ల మడిమల వాపుతో కన్పించడంతో లెక్కలేనన్ని పుకార్లకు తెర లేచింది.
ఆయన ఆరోగ్యం నిక్షేపంగా ఉందంటూ వైట్‌హౌస్ వర్గాలు వెంటనే వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం నేటికీ ఆగలేదు. అందుకు తగ్గట్టే, ట్రంప్ తన గాయాలు, వాపులు తదితరాలను మేకప్‌తో మేనేజ్ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కూడా విపరీతంగా వార్తలు వెలువడ్డాయి. పైగా తాజా పుకార్లపై వైట్‌హౌస్ కూడా మౌనం పాటిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఇటీవల స్వయానా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (41) చేసిన వ్యాఖ్యలు వీటికి మరింత ఆజ్యం పోశాయి.
‘‘200 రోజులుగా (ఉపా ధ్యక్షునిగా) మంచి శిక్షణ పొందుతూ వస్తున్నా. పెను విషాదమేదైనా జరిగి తప్పనిసరైతే, ‘పెద్ద బాధ్యతలు’ స్వీకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నా ’’ అని బుధవారం ఒక ఇంటర్వ్యూలో అన్నారాయ న! ఆ వెంటనే సర్దుకుని, ‘‘ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉంది. ఈ వయసులో కూడా అర్ధరాత్రి దాటేదాకా పని చస్తున్నారు. మళ్లీ తెల్లవారుజామునే మేల్కొంటున్నారు’’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి కన్పించని ట్రంప్, శనివారం ఉదయమే తన మనవ రాలు కై తదితరులతో కలిసి వర్జీనియాలో గోల్ఫ్ క్లబ్‌కు వెళుతున్న ఫొటోలు బయటికొచ్చాయి.
జనానికి దూరంగా...
కొంతకాలంగా ట్రంప్ బయట కన్పించడం బాగా తగ్గింది. అలాగని బయటి ప్రపంచానికి ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో శనివారం తెల్లవారుజామున కూడా ఆయన ఖాతాలో ఒక మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లు ఇంకా అమల్లోనే ఉన్నాయని ట్రంప్ అందులో రాసుకొచ్చారు.
ఆ గాయం వెనక...
అప్పట్లో ఓవల్ ఆఫీసులో భేటీ సందర్భంగా గాయాలైన కుడి అరచేయిని ట్రంప్ వీలైనంతగా కప్పుకుంటూ మీడియా కంటబడ్డారు. దక్షిణ కొరియా అధ్యక్షునితో భేటీ సందర్భంగా కుడిచేయి వెనకవైపు గాయంతో కనిపిస్తున్న ట్రంప్ ఫొటోలు తాజాగా విపరీతంగా ట్రెండయ్యాయి. ఆయన దీర్ఘకాలంగా నరాల బలహీనతతో బాధపడుతున్నట్టు తాజాగా జరిపిన వార్షిక ఆరోగ్య పరీక్షల్లో తేలింది. 70 ఏళ్ల పైబడ్డ వారిలో ఇది సాధారణమేనని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ అప్పట్లో అన్నారు. ట్రంప్ నరాల సమస్య పెద్ద విషయమేమీ కాదంటూ ఆయన వ్యక్తిగత వైద్యుని పేరిట ఒక లేఖ నోట్‌ను కూడా ప్రభుత్వం హడావుడిగా విడుదల చేసింది. అంతకుముందు గత ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో భేటీ సందర్భంగా కూడా ట్రంప్ కుడి చేయి ఇలాగే వార్తల్లో నిలిచింది. దానికి కొట్టొచి్చనట్టుగా కన్పించే స్థాయిలో మేకప్ వేసుకున్న వైనాన్ని అంతా గమనించారు.