
26, 27వ తేదీల్లో మలేసియాలో ఆసియాన్ శిఖరాగ్రం
కౌలాలంపూర్‌లో నేతల భేటీకి అవకాశం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్‌లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు.
ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది.