
సోషల్ మీడియా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మనవరాలు కై ట్రంప్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. తన గోల్ఫ్ ఆటకు సంబంధించిన ఫోటోలు, వైట్‌హౌజ్‌లో తాతతో గడిపిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. ‘17... నువ్వు నాకు జీవితం గురించి ఎంతో చె΄్పావు. 18... నువ్వు కూడా అలాగే చేస్తావని ఆశిస్తున్నాను’ అని తన పోస్ట్‌లో రాసింది కై ట్రంప్.
‘లాస్ట్ డే బీయింగ్ 17’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియోలో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది కై. తాత కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ఉపన్యాసాలు ఇచ్చింది. రాజకీయ ఉపన్యాసాల సంగతి ఎలా ఉన్నా గోల్ఫ్ ఆటలో చక్కని ప్రతిభ చూపుతోంది. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే ‘సోషల్ మీడియా సెన్సేషన్’ అయింది.