హార్వర్డ్‌లో విదేశీ  విద్యార్థులే ఎక్కువ  | Donald Trump demands list of names of Harvard foreign students | Sakshi
Sakshi News home page

హార్వర్డ్‌లో విదేశీ  విద్యార్థులే ఎక్కువ 

May 26 2025 4:56 AM | Updated on May 26 2025 4:56 AM

Donald Trump demands list of names of Harvard foreign students

వారి వివరాలు వెల్లడించాలి: ట్రంప్‌ 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంపై దాడిని కొనసాగించారు. వర్సిటీ ఎస్‌ఈవీపీ హోదా రద్దును నిలిపేస్తూ తన ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన సమరి్థంచారు. అక్కడ చదువుతున్నవారిలో 31శాతం విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి పూర్తి వివరాలను వెల్లడించాలని ట్రూత్‌సోషల్‌ వేదికగా ట్రంప్‌ పునరుద్ఘాటించారు. 

అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ స్పందించారు. ‘హార్వర్డ్‌లో చదువుతున్నవారిలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులే. పదేపదే ప్రభుత్వం అభ్యరి్థంచినప్పటికీ విశ్వవిద్యాలయ ఆయా విద్యార్థుల గురించి వివరాలను అందించడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? వారిలో ఎక్కువ మంది అమెరికా వ్యతిరేక దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థుల విద్యకోసం వారేమీ చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థులు ఎవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు.  

443 కోట్లు ఖర్చు చేయండి..  
‘హార్వర్డ్‌ యూనివర్సిటీకి బిలియన్‌ డాలర్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వంగా వివరాలు అభ్యర్థించడం సహేతుకమైనది. మాకు ఆ విద్యార్థుల పేర్లు, వారి దేశా ల వివరాలు కావాలి. లేదంటే హార్వర్డ్‌ దగ్గర దాదా పు రూ.443 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటినే ఉపయోగించుకోవాలి. ఫెడరల్‌ ప్రభుత్వాన్ని నిధు లు అడగకూడదు’అని ట్రంప్‌ హెచ్చరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement