breaking news
Revocation license
-
హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులే ఎక్కువ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై దాడిని కొనసాగించారు. వర్సిటీ ఎస్ఈవీపీ హోదా రద్దును నిలిపేస్తూ తన ప్రభుత్వం తీసుకున్న చర్యను ఆయన సమరి్థంచారు. అక్కడ చదువుతున్నవారిలో 31శాతం విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి పూర్తి వివరాలను వెల్లడించాలని ట్రూత్‌సోషల్ వేదికగా ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘హార్వర్డ్‌లో చదువుతున్నవారిలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులే. పదేపదే ప్రభుత్వం అభ్యరి్థంచినప్పటికీ విశ్వవిద్యాలయ ఆయా విద్యార్థుల గురించి వివరాలను అందించడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? వారిలో ఎక్కువ మంది అమెరికా వ్యతిరేక దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థుల విద్యకోసం వారేమీ చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థులు ఎవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’అని ట్రంప్ పేర్కొన్నారు. 443 కోట్లు ఖర్చు చేయండి.. ‘హార్వర్డ్ యూనివర్సిటీకి బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చిన ప్రభుత్వంగా వివరాలు అభ్యర్థించడం సహేతుకమైనది. మాకు ఆ విద్యార్థుల పేర్లు, వారి దేశా ల వివరాలు కావాలి. లేదంటే హార్వర్డ్ దగ్గర దాదా పు రూ.443 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటినే ఉపయోగించుకోవాలి. ఫెడరల్ ప్రభుత్వాన్ని నిధు లు అడగకూడదు’అని ట్రంప్ హెచ్చరించారు. -
ఎట్టకేలకు మట్టి మాఫియాకు చెక్
* ఆత్మకూరు చెరువు భూమి తవ్వకాల్లో అక్రమాలు * ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్, మైనింగ్ అధికారుల్లో కదలిక * వే బిల్లులు ఇచ్చేందుకు నిరాకరణ * లెసైన్సు రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఆత్మకూరు (మంగళగిరి రూరల్) : ఆత్మకూరు చెరువు భూమిలోని మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. గత నవంబర్ నుంచి నిర్విరామంగా మట్టిని తవ్వుకుంటూ కోట్ల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మట్టి మాఫియాకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. వే బిల్లులు ఈనెల 20వరకు మాత్రమే వుండడంతో మట్టి రవాణాకు తిరిగి వే బిల్లులు ఇచ్చేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించారు. మట్టి అక్రమ తవ్వకాలపై సాక్షి పత్రికలో ప్రచురితమైన పలు కథనాలపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఉన్నతాధికారులను కలసి అక్రమ మట్టి, ఇసుక రవాణాలను అరికట్టాలని కోరారు. ఆ మేరకు విజిలెన్స్, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి జరిమానా వసూలు చేయడంతో పాటు లెసైన్స్ రద్దుచేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఉన్నతాధికారులు ఇచ్చిన వేబిల్లుల వరకు అనుమతులు ఇవ్వాలని, తదుపరి వే బిల్లులు మంజూరు చేయవద్దంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. దీంతో మట్టి తవ్వకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. జిల్లా అధికారులు మట్టితవ్వకాలకు సంబంధించి వే బిల్లులు మంజూరు చేయబోమని, మట్టి రవాణా నిలిచిపోయినట్లేనని చెబుతుంటే.. మండల అధికారులు మాత్రం కాంట్రాక్టర్‌కు 2015 వరకు అనుమతులు వున్నాయని, త్వరలోనే తిరిగి మట్టి తవ్వకాలు కొనసాగించుకోవచ్చని చెప్పడం గమనార్హం! ఈ విషయమై మైనింగ్ ఏడీ జగన్మాథరావును వివరణ కోరగా ఈనెల 20వ తేదీతో వే బిల్లుల కాలపరిమితి అయిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఇక ఎటువంటి వే బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి లెసైన్స్ రద్దు చేయాలని నివేదిక పంపామని, అందుకనుగుణంగా వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఏడీ తెలిపారు.