సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం | Donald Trump to pause anti-immigrant raids in on farms, hotels | Sakshi
Sakshi News home page

సోదాలు, అరెస్టులకు తాత్కాలిక విరామం

Jun 15 2025 4:58 AM | Updated on Jun 15 2025 11:21 AM

Donald Trump to pause anti-immigrant raids in on farms, hotels

వలసదారులపై వైఖరి మార్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 

వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయండి 

ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఆదేశాలు  

వాషింగ్టన్‌:  అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన వైఖరి మార్చుకున్నారు. వలసదారులందరినీ ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా బయటకు తరిమేస్తే తలెత్తే ఇబ్బందుమిటో అనుభవంలోకి వస్తున్నాయి. కార్మిక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతే పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొనే ప్రమాదం పొంచి ఉంది. అందుకే సోదాలు, అరెస్టులు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

 వ్యవసాయ క్షేత్రాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో సోదాలు నిలిపివేయాలని ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ)కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాంసం ప్యాకింగ్‌ ప్లాంట్లతోపాటు చేపల పెంపకం కేంద్రాల్లోనూ సోదాలు నిలిపివేయాలని ప్రభుత్వం పేర్కొంది. 

ఈ మేరకు గురువారం రాత్రి ఐసీఈ అధికారులకు అధికారికంగా ఈ–మెయిల్‌ పంపించినట్లు సమాచారం. ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఈ విషయం ధ్రువీకరించారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మానవ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం వస్తే సోదాలు కొనసాగించవచ్చని, అరెస్టులు చేయొచ్చని ప్రభుత్వం తేల్చిచెప్పింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement