వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ సోమవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతోపాటు తైవాన్, ఉక్రెయిన్ వ్యవహారాలపై వారిద్ద రూ చర్చించుకున్నట్లు అమెరికా, చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ట్రంప్, జిన్‌పింగ్ కలుసుకున్నారు. ఇంతలోనే మరో సారి వారు చర్చించుకోవడం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్‌పింగ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్‌కు స్పష్టంచేశారు.


