
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్‌ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్‌దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్‌కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్‌కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్‌ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి.