breaking news
missile defence
-
బాలిస్టిక్ క్షిపణి అడ్డగింతలో సక్సెస్
న్యూఢిల్లీ: శత్రుసైన్యం ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సాంకేతికతను భారత్ తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. దీంతో బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్(బీఎండీ) సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. దీంతో బీఎండీ సాంకేతికతను సాధించిన దేశాల జాబితాలో భారత్ చేరింది. భారతీయ యుద్ధనౌకల మీదకు దూసుకొచ్చే శత్రువుల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించే సాంకేతికతను పరీక్షించామని శనివారం భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులు, శత్రువుల నిఘా, పర్యవేక్షణ విమానాలను అడ్డుకునే సాంకేతికతను బీఎండీగా వ్యవహరిస్తారు. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు మాత్రమే ఇన్నాళ్లూ ఈ సాంకేతికతను సాధించాయి.‘‘జూన్ 10, 11వ తేదీల్లో పలు దశల్లో బీఎండీ టెక్నాలజీని పరీక్షించాం. ముందే షెడ్యూల్చేసిన లక్ష్యాలను ఛేదించేందుకు దూసుకొచి్చన బాలిస్టిక్ క్షిపణులను ఈ టెక్నాలజీతో అడ్డుకున్నాం’’అని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దీనిని పరీక్షించింది. దీంతోపాటే నౌకలను నాశనంచేసే క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునే మధ్యశ్రేణి క్షిపణి(ఎన్ఏఎస్ఎం–ఎంఆర్)ను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించామని రక్షణ శాఖ వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలోపు ఎత్తులో ఉన్నప్పుడు, 100 కి.మీ.ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న క్షిపణులనూ తమ బీఎండీ సాంకేతికత అడ్డుకుందని రక్షణ శాఖ తెలిపింది.ప్రయోగాలు, పరీక్షలను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ బలగాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షలను విజయవంతం చేసినందుకు డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, రక్షణ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ‘‘శత్రు క్షిపణుల నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టార్లను విజయవంతంగా పరీక్షించాం. అధునాతన సాంకేతికతతో వీటిని డిజైన్చేసి అభివృద్ధిచేశారు’’అని రాజ్‌నాథ్ వెల్లడించారు. సంక్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధిచేసి ఆచరణలో పెట్టినందుకు డీఆర్డీవోను మంత్రి ప్రత్యేకంగా అభినందిస్తూ ‘ఎక్స్’లో పోస్ట్‌పెట్టారు. -
ఉక్రెయిన్‌కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్‌కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్‌కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి. -
‘సుదర్శన్ ఎస్-400’ పరీక్ష విజయవంతం
భారత వైమానిక దళం ‘సుదర్శన్ ఎస్-400’ రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. భారతదేశం తన వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి రష్యాతో కలిసి ‘సుదర్శన్ ఎస్-400’ను తయారుచేసినట్లు చెప్పారు.ఈ మేరకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ..‘సుదర్శన్ ఎస్-400 రక్షణ క్షిపణి పరీక్ష విజయవంతం అయింది. శత్రు విమానాలను 80 శాతం కంటే అధిక రేటుతో నాశనం చేసింది. విమానాలపై అటాక్ చేసి అవి ముందుకు కదలకుండా నిరోధించింది. ఈ వ్యవస్థ వల్ల భారత వైమానిక రక్షణ దళం మరింత పురోగమించింది. రష్యా-భారత్ కలిసి వీటిని ఈ వ్యవస్థను రూపొందించాయి. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో రెండు స్క్వాడ్రన్లు సిద్ధం అవుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఉచితంగా రూ.1.09 లక్షల విలువైన ఫోన్!సుదర్శన్ ఎస్-400 ఐదు స్క్వాడ్రన్ల కోసం గతంలో రెండు దేశాలు రూ.35,000 కోట్లకు పైగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఎంఆర్-సామ్ క్షిపణి వ్యవస్థ భారత వైమానిక రక్షణ దళంలో చేరింది. దాంతోపాటు ‘ఇజ్రాయెలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్’ క్షిపణి వ్యవస్థ సైతం ఎయిర్‌ఫోర్స్‌లో చేరింది. తాజాగా ఎస్-400 కూడా వాటికి తోడవడంతో వైమానిక దళం గేమ్ ఛేంజర్‌గా మారిందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ‘ప్రాజెక్ట్ కుషా’తో మరింత సమర్థవంతమైన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు భద్రతపై గతంలోనే కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. -
మా క్షిపణులతో చైనాను రౌండప్ చేసేస్తాం!
బీజింగ్: నానాటికి దూసుకుపోతున్న చైనాకు చెక్ పెట్టేవిషయంలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వైఖరి వెల్లడించే రహస్య సంభాషణ ఒకటి వెలుగుచూసింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలను చైనా నిలువరించకపోతే.. ఆ దేశాన్ని తమ క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టేస్తామని హిల్లరీ క్లింటన్ ఓ ప్రైవేటు సంభాషణలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె అమెరికా అధ్యక్షురాలైతే.. చైనాపై ఏ విధమైన వైఖరి అవలంబించనున్నారో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హిల్లరీ ప్రచార చైర్మన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను హ్యాక్ చేసి.. ఆ వివరాలను వీకీలీక్స్ తాజాగా వెల్లడించింది. ఈ ఈమెయిల్స్‌లో హిల్లరీ ప్రైవేటు సంభాషణలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలతోపాటు పలు ఇతర పత్రాలు ఉన్నాయి. వీటిని వెల్లడించడానికి హిల్లరీ ఇన్నాళ్లు నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చైనీస్ అధికారులను ఎలా ఎదుర్కొన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉత్తర కొరియా ఈ ఏడాది ఐదోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించాలని అమెరికా, దక్షిణ కోరియా భావిస్తుండగా.. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఉత్తర కొరియా క్షిపణి ముప్పును నివారించడానికి అమెరికా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో మరిన్ని మిలిటరీ నౌకలను మోహరిస్తుందని చైనా అధికారులకు తాను స్పష్టం చేసినట్టు హిల్లరీ 2013లో ప్రైవేటుగా ఇచ్చిన ఓ ఉపన్యాసంలో వెల్లడించారు. 'ఉత్తర కొరియా విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణులను పొందితే.. అది పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా మారుతుంది. అంతేకాకుండా అమెరికా పశ్చిమ తీరమైన హావాయ్ను ఆ క్షిపణులు ఢీకొట్టగలవు' అని క్లింటన్ పేర్కొన్నారు. "మేం చైనాను క్షిపణి రక్షణ వ్యవస్థను చుట్టుముట్టబోతున్నాం. ఆ ప్రాంతంలో మరింత నౌకాదళాన్ని మోహరించబోతున్నాం. చైనా.. నువ్వు వారిని (ఉత్తరకొరియా)ను నియంత్రించు.. లేదా మేం వారికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని ఆమె పేర్కొన్నారు. వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతూ.. అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తరకొరియాకు ఏకైక జీవనాధారంగా చైనా అండగా నిలబడుతోంది. ఆ దేశానికి సన్నిహిత దౌత్య, మిత్ర దేశంగా చైనా అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను చైనా నిలువరించడం లేదంటూ ఆ దేశంపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.


