
వాషింగ్టన్: టారిఫ్‌ల వ్యవహారం తేలేదాకా, భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ వస్తువులపై టారిఫ్‌లను 50 శాతానికి పెంచిన నేపథ్యంలో వాణిజ్య చర్చలను ముమ్మరం చేస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్..భారత్‌తో ముందు టారిఫ్‌ల వ్యవహారం కొలిక్కిరావాలని, అప్పటి వరకు వాణిజ్య చర్చలు జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు.
ట్రంప్ రెండో విడత పెంచిన 25 శాతం టారిఫ్‌లు 21 రోజుల తర్వాత ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ భారతీయ అమెరికన్ అటార్నీ రవి బాత్రా స్పందించారు. ట్రంప్ కోరిన విధంగా ఉక్రెయిన్‌తో రష్యా కాల్పుల విరమణకు రాకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. భారత్‌ను బాధపెడితే రష్యాను బాధపెట్టినట్లే. అదే సమయంలో అది మమ్మల్నీ మరింతగా బాధపెడుతుంది’అని ఆయన వ్యాఖ్యానించారు.