వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ, మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ తదితరులకు క్షమాభిక్ష ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఫలితాలను ప్రభావితం చేసేందుకు యత్నించగా సహకరించినట్లు వీరిపై ఆరోపణలు న్నాయి.
వీరికి అధ్యక్షుడు ట్రంప్ ‘సంపూర్ణ, బేష రతు’ క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకం చేశారని ప్రభుత్వ అటార్నీ ఎడ్ మార్టిన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఈ అవకాశం దక్కిన వారిలో సిడ్నీ పావెల్, జాన్ ఈస్ట్‌మన్ అనే లాయర్లున్నారు. వీరితోపాటు 2020 ఎన్నికల్లో ట్రంప్ తరఫున నకిలీ ఓటర్లుగా మారిన రిపబ్లికన్ పార్టీకి చెందిన కనీసం డజను మంది ఉన్నారు. కాగా, ఈ క్షమాభిక్ష ట్రంప్‌నకు వర్తించదని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది.


