నార్వే ప్రధానికి పంపిన మెసేజ్‌లో ట్రంప్
గ్రీన్‌లాండ్‌పై ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడి వితండవాదం
ఓస్లో: గ్రీన్‌లాండ్ అంశంపై ఉద్రిక్త తలు కొనసాగుతున్న వేళ నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. నోబెల్ శాంతి బహుమ తిని, గ్రీన్‌లాండ్‌తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు తనకో సందేశం పంపారని చెప్పారు. ‘నోబెల్ శాంతి బహుమతి నాకు లభించలేదు. కాబట్టి, శాంతి గురించి మాత్రమే మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు’అని అందులో ట్రంప్ పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఎనిమి దికి పైగా యుద్ధాలను ఆపినందుకుగాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది.
అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్య త నాకు ఉందని అనుకో వడం లేదు. శాంతికి ఎప్పు డూ ప్రాధాన్యత ఉంటుంది, కానీ, ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్‌లాండ్‌పై మాకు పూర్తి, సమగ్ర నియంత్రణ ఉంటే తప్ప ఈ ప్రపంచం సురక్షి తంగా ఉండదు’అని ఆయన అందులో పేర్కొ న్నట్లు జొనాస్ వివరించారు. ట్రంప్ నోబెల్ వాదనపై జొనాస్.. ‘నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వేజి యన్ నోబెల్ కమిటీయే తప్ప నార్వే ప్రభు త్వం కాదు. కమిటీ ఒక స్వతంత్ర విభాగం. అందులోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుంది’అని వివరించారు.


