breaking news
UK Prime Minister
-
తక్షణ బహిష్కరణ.. ఆపై విచారణ!
లండన్: అక్రమ వలసదారులకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గట్టి హెచ్చరికలు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తక్షణమే బహిష్కరించి, ఆ తర్వాతే ఆన్లైన్లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’స్కీంలో ఉన్న దేశాల సంఖ్య 8 నుంచి భారత్ సహా 23కు పెంచిన నేపథ్యంలో స్టార్మర్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ‘మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చినట్లయితే నేరానికి పాల్పడినట్లే. ఇందుకుగాను డిటెన్షన్‌ను, బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వేగంగా మిమ్మల్ని వెనక్కి పంపివేస్తాం’అని సోమవారం ఎక్స్‌లో స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఎంతో కాలంగా విదేశీ నేరగాళ్లు మా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. వారి అప్పీల్స్ వాయిదా పడుతుండటంతో యూకేలో నెలలు, సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలుకుతాం’అని ఆయన పేర్కొన్నారు. తాజాగా పెంచిన జాబితాలోని 23 దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపించివేస్తారు. వారి అప్పీళ్లపై వీడియో లింక్ ద్వారా విచారణ చేపడతారు. విదేశీ నేరగాళ్లను తొలగించడం, డిటెన్షన్ సెంటర్లపై ఒత్తిడి తగ్గించడం, ప్రజా ధనాన్ని ఆదా చేయడమే తమ లక్ష్యమని యూకే ప్రభుత్వం అంటోంది. 2023లో మొదటగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు అందులోని జాబితాలో ఆల్బేనియా, కొసావో, నైజీరియా, ఎస్టోనియా దేశాలే ఉన్నాయి. విస్తరించిన జాబితాలో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా, కెన్యా, ఉగాండా తదితర దేశాలను చేర్చారు. దీనిపై ఆయా దేశాలతో యూకే అధికారులు చర్చలు ప్రారంభించారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైతం ఇప్పటికే విదేశీయులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తుండటం తెల్సిందే.భారతీయులు సహా వందలాది మంది అరెస్ట్దేశవ్యాప్తంగా అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు సహా వందలాదిమందిని యూకే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా బైక్‌లపై డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జూలై 20–27 తేదీల మధ్యన చేపట్టిన తనిఖీల్లో 1,780 అక్రమంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, 280 మంది అనుమతులు లేకుండా పనులు చేసే వలసదారులు పట్టుబడ్డారని వెల్లడించారు. హిల్లింగ్డన్లో ఏడుగురు భారతీయులు దొరికారని, వీరిలో ఐదుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్‌కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్‌వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్‌లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్