తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎట్టకేలకు ఖరారైంది. గ్రీన్‌ల్యాం డ్స్‌లోని తన అధికార నివాసానికి పక్కనే ఉన్న
హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎట్టకేలకు ఖరారైంది. గ్రీన్‌ల్యాం డ్స్‌లోని తన అధికార నివాసానికి పక్కనే ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) పాత భవనాన్ని ఎంపిక చేసుకున్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో వాస్తులోపాలున్నాయ న్న ఉద్దేశంతో సీఎం దాన్ని విని యోగించడం లేదు. అదే ప్రాంగణంలోని నివాస భవనానికే ఆయన పరిమితమయ్యారు. అయితే సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో నివాసభవనంలో స్థలాభావం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అతిథులతో భేటీ, ప్రభుత్వ విభాగాలతో సమీక్షలకు కూడా అది అనుకూలంగా లేదు. కుందన్‌బాగ్‌లోని ఐఏఎస్ అధికారుల నివాస ప్రాంగణంలోని భవనాలను, ముషీరాబాద్, బంజారాహిల్స్‌లోని మరికొన్ని భవనాలను అధికారులు పరిశీలిం చారు. ఈ క్రమంలో ఆయన అధికారిక నివాసం సమీపంలో నిజాం కాలంలో నిర్మితమైన ఎస్‌ఐబీ భవనం చూడముచ్చటగా ఉండడంతోపాటు, ఇటు నివాసానికి, సచివాలయాని కి చేరువగా ఉండడంతో సీఎం దానికి ఓకే చెప్పేశారు.