గ్రీన్‌లాండ్‌ను ట్రంప్‌ నుంచి కాపాడతాం: ఇరాన్‌  | Iran Offers To Protect Greenland From Donald Trump | Sakshi
Sakshi News home page

గ్రీన్‌లాండ్‌ను ట్రంప్‌ నుంచి కాపాడతాం: ఇరాన్‌ 

Mar 23 2026 5:11 AM | Updated on Mar 23 2026 6:07 AM

Iran Offers To Protect Greenland From Donald Trump

ఈయూ పిలిస్తే వచ్చేస్తామని ప్రకటన! 

టెహ్రాన్‌: గ్రీన్‌లాండ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బారినుంచి కాపాడుతామంటూ ఇరాన్‌ ముందుకు వచ్చింది! పిలిస్తే చాలు, వచ్చి రక్షిస్తామని యూరోపియన్‌ యూనియన్‌ను ఉద్దేశించి పేర్కొంది. ‘‘గ్రీన్‌లాండ్‌ను స్వాదీనం చేసుకుంటామంటూ ఈయూను ట్రంప్‌ బెదిరించారు. 

వారు గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేని పక్షంలో మాకు ఒక్క మాట చెబితే చాలు, ఆ ద్వాపానికి అండగా వస్తాం’’ అని ఇరాన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆదివారం పేర్కొన్నారు. ఇరాన్‌ మూసేసిన హార్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ముందుకు రావాలని ఈయూతో పాటు ఇతర దేశాలను ట్రంప్‌ కోరుతుండటం తెలిసిందే. కానీ ఇప్పటిదాకా సానుకూల స్పందన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రీన్‌లాండ్‌ విషయంలో ఈయూకు ఇరాన్‌ ఇలా ఆఫర్‌ ఇవ్వడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement