బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికి దాదాపు సగం ఊరటనిచ్చాయి.
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.2250 పెరిగి రూ. 1,49,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.1550లకే పరిమితమై రూ.1,48,450లకు దిగివచ్చింది.
ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.2450 ఎగిసి రూ. 1,62,710 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.1690 లకు నెమ్మదించి రూ.1,61,950లకు చేరుకుంది.
అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


