దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్‌లోనూ క్షీణించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి.


