యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ బీఎస్‌ఈ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కార్తీక్ కుమార్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
బీఎస్‌ఈ 500 సూచీలోని 21 రంగాల కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రతీ రంగం నుంచి టాప్ 3 కంపెనీలను ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా రంగాల్లోని అగ్రగామి కంపెనీల్లో ఎక్స్‌పోజర్ లభిస్తుంది.
శామ్కో మిడ్‌క్యాప్ ఫండ్
శామ్కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్.. శామ్కో మిడ్‌క్యాప్ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బలమైన ఆదాయం, లాభాలు, ధరల తీరు ఆధారంగా భవిష్యత్తులో బలంగా ఎదిగే మధ్యస్థాయి కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఇందుకు గాను ‘కేర్’ విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్ కిందకు వస్తాయి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 4 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.


