ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు.. స్పందించిన NHAI | No Fastag Annual Pass For Three Row Cars NHAI Clarifies Know The Details | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు.. స్పందించిన NHAI

Jan 26 2026 5:08 PM | Updated on Jan 26 2026 5:19 PM

No Fastag Annual Pass For Three Row Cars NHAI Clarifies Know The Details

ఇటీవల సోషల్ మీడియాలో 2026 జనవరి 1 నుంచి 3 రో కార్లు (6 లేదా 7 సీట్లున్న కార్లు) కోసం ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు చేశారని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో చాలామంది వాహనదారుల్లో ఒకింత అయోమయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా స్పందించింది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా తప్పుడు సమాచారం అని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర కార్లు / జీపులు / వ్యాన్లు యాన్యువల్ పాస్‌కు అర్హత కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్
భారతదేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకొచ్చింది. దీనిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌ను పరిచయం చేసింది. ఈ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా వాహనదారుడు గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్స్ చేయవచ్చు. ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న NHAI టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ తేదీ నుంచి ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement