యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. నవంబర్ 11 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ప్రధానంగా డెట్ ఆధారిత ఫండ్ స్కీముల్లో 50–65 శాతం వరకు, ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో 35–50 శాతం వరకు, మిగతాది మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
ఈ ఫండ్ స్థిరంగా మెరుగైన రాబడిని, పన్ను ఆదా ప్రయోజనాలను అందిస్తుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్ తెలిపారు. తక్కువ రిస్కుతో, పన్నులు పోగా మరింత మెరుగైన రాబడిని కావాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. దేవాంగ్ షా, ఆదిత్య పగారియా, హార్దిక్ సత్రా, కార్తీక్ కుమార్ ఈ ఫండ్‌ని నిర్వహిస్తారు.


