బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో పసిడి ధరలు ఎగుస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికే మరింత పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.4600 పెరిగి రూ. 1,41,900 లకు చేరుకోగా సాయంత్రానికి మొత్తంగా రూ.6250 ఎగిసి రూ.1,43,550లకు చేరింది.
ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.5020 ఎగిసి రూ. 1,54,800 లను తాకగా సాయంత్రానికి మొత్తంగా రూ.6820 పెరిగి రూ.1,56,600లకు చేరుకుంది.
అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


