కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి! | Stock Market Closing Update 20th January 2025 | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్ల సంపద ఆవిరి!

Jan 20 2026 3:40 PM | Updated on Jan 20 2026 4:16 PM

Stock Market Closing Update 20th January 2025

మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది.
 

ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
 
Advertisement
Advertisement