అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’.. | V Hanumantha Rao during the election campaign in Sircilla municipality | Sakshi
Sakshi News home page

అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..

Feb 8 2026 3:24 AM | Updated on Feb 8 2026 3:24 AM

V Hanumantha Rao during the election campaign in Sircilla municipality

వీహెచ్‌ మార్కు చలోక్తులతో సిరిసిల్లలో సందడి

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్‌ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. 

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్‌ అవుతుంటారు.. కానీ వీహెచ్‌ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్‌ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement