నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డులు, చైర్పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది.
మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్‌పైనా ప్రభుత్వం నోటిఫికేషన్‌లో మార్గదర్శకాలను పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు సీట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే రాజ్యాంగ మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించినట్లు స్పష్టం చేసింది.
ముఖ్య మార్గదర్శకాలు
జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు
బీసీ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు అమలు
మహిళలకు మొత్తం సీట్లలో 50% రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్ లాటరీ విధానంలో ఖరారు
తాజా జనగణన డేటా ఆధారంగా సీట్ల ఖరారు
SEEEPC సర్వే–2024 డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు
గత ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డులు ఈసారి మినహాయింపు
మున్సిపాలిటీల్లో వార్డులకు 2011 జనగణన ఆధారంగా ఎస్సీ, ఎస్టీ సీట్ల కేటాయింపు
బీసీలకు ప్రత్యేక కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్
మహిళలకు (జనరల్) 2019 టీఎం చట్టం ప్రకారం సీట్లు
ప్రతి మున్సిపాలిటీలో మొత్తం వార్డుల సంఖ్య ఖరారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, అన్‌రిజర్వ్డ్ సీట్ల స్పష్టమైన విభజన
గ్రేటర్ కాకుండా అన్ని మున్సిపాలిటీలకు వర్తింపు
జిల్లా వారీగా రిజర్వేషన్ పట్టికలు విడుదల


