2,996 వార్డులకు 29,742 సెట్ల నామినేషన్లు | Massive nominations in municipal elections | Sakshi
Sakshi News home page

2,996 వార్డులకు 29,742 సెట్ల నామినేషన్లు

Feb 1 2026 4:09 AM | Updated on Feb 1 2026 4:09 AM

Massive nominations in municipal elections

మున్సిపల్‌ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తరపున వేలాదిగా సెట్లు 

నామినేషన్ల స్క్రూటినీ పూర్తి, నేడు, రేపు అప్పీళ్లు 

3న గుర్తుల కేటాయింపు, అభ్యర్థుల తుది జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 వార్డులు/డివిజన్లకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. జనవరి 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల పర్వంలో 22,519 మంది అభ్యర్థులు 29,742 సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ తరపున అత్యధికంగా 10,046 సెట్లు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నుంచి 7,564 సెట్లను అభ్యర్థులు సమర్పించారు. 

బీజేపీ నుంచి 5,462 సెట్లను అభ్యర్థులు సమర్పించారు. శనివారం నామినేషన్‌ పత్రాల స్క్రూటినీ జరగ్గా, ఆదివారం అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. సోమవారం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించి, వార్డుల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రిటరి్నంగ్‌ అధికారులు విడుదల చేస్తారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement