డీసీసీ కార్యాలయంలో సంబరాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్.. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరితో కలిసి కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతోపాటు దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, రాపర్తి శరత్, గజ్జెల్లి వెంకన్న, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, మొక్క శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంసహకారనగర్/ఖమ్మంరూరల్: ఐదు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రియదర్శిని కళాశాలలో ఏదులాపురం మున్సిపల్ లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించాక, కలెక్టరేట్‌లో మానిటరింగ్ సెల్ నుంచి అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులను అభినందించిన సీపీ
ఖమ్మంక్రైం: ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు, లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా బందోబస్తు విధులు నిర్వర్తించిన పోలీసు ఉద్యోగులను సీపీ సునీల్‌దత్ అభినందించారు.
నేడు వేంసూరు పాఠశాల వజ్రోత్సవాలు
వేంసూరు: 1950లో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభమై 75 ఏళ్లు పూర్తిచేసుకున్న వేంసూరు ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలను శనివారం నిర్వహించనున్నారు. ఎందరో విద్యార్థుల ఉన్నతికి ఈ పాఠశాల ఉపాధ్యాయుల బోధన కారణమైంది. ఈ నేపథ్యాన నిర్వహిస్తున్న వజ్రోత్సవాలకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వారే కాకుండా స్థానిక పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు.
ప్రజా భాగస్వామ్యంతోనే అడవుల రక్షణ
● పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ
సత్తుపల్లిటౌన్: అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే మంచి ఫలితాలు వస్తాయని అటవీశాఖ పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ తెలిపారు. సీసీఎఫ్ డాక్టర్ భీమానాయక్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌విక్రమ్‌సింగ్‌తో కలిసి శుక్రవారం ఆమె సత్తుపల్లి రేంజ్‌లో పర్యటించారు. టింబర్ డిపోలో రూ.5 లక్షలతో నిర్మించిన వీఐపీ గది, చంద్రాయపాలెంలో వాచ్‌టవర్‌ను ప్రారంభించాక చంద్రాయపాలెంలో ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ నిధులతో వేయించిన రంగులను పరిశీలించారు. చంద్రాయపాలెం వనసంరక్షణ సమితి సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన కంటెయినర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఎఫ్‌డీఓ వి.మంజుల, రేంజర్ పి.స్నేహలత, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా శ్రావణ్‌కుమార్
నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం పీహెచ్‌సీ వైద్యాధికారి రచ్చా శ్రావణ్‌కుమార్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీజీఎంసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఈమేరకు టీజీఎంసీ చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్యకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్‌ను నేలకొండపల్లి పీహెచ్‌సీ ఉద్యోగులు శుక్రవారం ఘనంగా సన్మానించారు.
డీసీసీ కార్యాలయంలో సంబరాలు
డీసీసీ కార్యాలయంలో సంబరాలు
డీసీసీ కార్యాలయంలో సంబరాలు


