● రెజొనెన్స్ ఉత్తమ ప్రతిభ
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయభేరి మోగించారని రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్‌వీ.నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు. అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. ఎల్.రామ్మోహన్ రెడ్డి 99.09 పర్సంటైల్, కె.లహరి 96.34, ఎం.మోక్షిత 94.22, జి.భరత్‌చంద్ర 93.76, ఎండీ.నిఖత్ 93.94, శ్రీవర్షిణి 93.61 పర్సంటైల్ సాధించగా, 68శాతం మందికిపైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించారని తెలిపారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.


