ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి సాధిస్తాం
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గతేడాది తొలుత 76, అనంతరం 72, ఆ తర్వాత 60 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని, చివరకు 58 మిలియన్ టన్నుల ఉత్పత్తితో సరిపెట్టుకుంది. అయితే యాజమాన్యం మాత్రం యాడ్ కోల్ (సింగరేణి వ్యాప్తంగా గనుల్లో మిగిలిపోయిన 4 మిలియన్ టన్నుల బొగ్గు)ను రవాణాలో చూపించి మొత్తం 62 మిలియన్ టన్నుల రవాణా చేసినట్లు పేర్కొనడం గమనార్హం. గతంలో కూడా ఉత్పత్తి చేయకుండానే సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గును అధికంగా చూపిందనే ఆరోపణలు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీకి 367 క్యూబిక్ మీటర్ల ఓబీ మాత్రమే సాధించింది.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ప్రణాళిక
సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది. అధికంగా వర్షాలు రావటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈసారి ముందస్తు చర్యలు చేపట్టి ఏప్రిల్ నుంచే ఉత్పత్తిపై దృష్టి సారిస్తాం. కంపెనపీ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తాం.
–ఎల్‌వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్)


