రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే సీఎం, పీవీకే–5 ఇంక్‌లైన్ గనులను శుక్రవారం ఎంఈఎఫ్, ఈఏఈ సబ్ కమిటీ బృందం సందర్శించింది. సబ్ కమిటీ సభ్యులు డాక్టర్ లలిత్‌కపూర్, డాక్టర్ శవాల్గే చంద్రశేఖర్, ఫ్రొఫెసర్ రామ్‌మాధవ్ భట్టాచార్య, ఆర్‌సీహెచ్‌పీలో బొగ్గు రవాణా, వీకేఓసీని పరిశీలించారు. రుద్రంపూర్‌లోని ప్రగతి వనం పార్క్‌ను కూడా సందర్శించారు. తొలుత ఏరియా అధికారులు బొగ్గు ఉత్పత్తి, రవాణాపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల అధికారులు ఎం.శాలేంరాజు, కోటిరెడ్డి, సైదులు, నర్సింహారావు, మురళి తదితరులు పాల్గొన్నారు.


