భూసేకరణ వేగవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్ : నేషనల్ హైవే ప్రాజెక్ట్‌ల పూర్తికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధంసలాపురం ఎంట్రీ, ఎగ్జిట్ భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. నాగపూర్ – అమరావతి నేషనల్ హైవే ఖమ్మం – విజయవాడ ప్యాకేజీ –1కు సంబంధించి కొణిజర్ల మండలం గోపతి, బోనకల్ మండలం చిన్నబీరవెల్లి గ్రామాల్లో భూమి స్వాధీనానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఖమ్మం – విజయవాడ ప్యాకేజీ –2కు సంబంధించి మధిర, ఎర్రుపాలెంలో మిషన్ భగీరథ, అటవీశాఖలతో స్ట్రక్చరల్ వాల్యుయేషన్ పూర్తి చేసినందన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. కేబుల్ బ్రిడ్జి భూ సేకరణకు సంబంధించి అవార్డు మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అన్నారు. వీధి వ్యాపారులకు వెండర్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, నేషనల్ హైవే పీడీ దివ్య, తహసీల్దార్లు సైదులు, రమాదేవి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


