ఆలయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

ఆలయంల

ఆలయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలోని స్టోర్‌ రూమ్‌లను జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి లోకేష్‌కుమార్‌ సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. లడ్డూ తయారు చేసే వంటశాలను, తయారీ విధానం, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం అన్నదాన సత్రాన్ని పరిశీలించి వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ ఎస్‌ఏఐ) ద్వారా ఆలయాల్లో తయారు చేసే వస్తువుల నాణ్యతను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఈ అథారిటీ వారు యాదగిరిగుట్ట తర్వాత జమలాపురం వేంకటేశ్వరస్వామివారి దేవాలయాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఆలయంలో లడ్డూ తయారీకి, అన్నదానానికి వాడే పదార్థాల నమూనాలను సేకరించి నాణ్యతా ప్రమాణాల నిమిత్తం ఫుడ్‌ లేబోరేటరీకి పంపిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ సోమయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల్లో డీఏఓ తనిఖీ

కల్లూరు రూరల్‌ : మండలంలోని కప్పలబంధం, చెన్నూరు, గ్రామాల్లోని ఎరువుల దుకాణాల ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫెర్టిలైజర్‌ యాప్‌ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆ తర్వాత చెన్నూరులో రైతు గుర్తింపుకార్డు ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని ఎం.రూప, ఏఈఓలు పవన్‌ కళ్యాణ్‌, వెంకట లీల తదితరులు పాల్గొన్నారు.

మార్చి 4 నుంచి

సర్టిఫికెట్ల పరిశీలన

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో స్టాఫ్‌ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మార్చి 4, 5, 6 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం, గార్ల, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో డీసీసీబీ విస్తరించి ఉండగా 50బ్రాంచీల ద్వారా సేవలను విస్తృతం చేసేందుకు 99 స్టాఫ్‌ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి బ్యాంకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఐబీపీఎస్‌(ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) సంస్థ ద్వారా ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. పీఏసీ ఎస్‌ల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఇన్‌ సర్వీస్‌ కింద 25శాతం అవకాశం కల్పించారు. మార్చి మొద టి వారంలో సర్టిఫికెట్లు పరిశీలించి ఏప్రిల్‌ మొదటి వారంలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

ఆలయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ1
1/1

ఆలయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement