తీర్థాల ఆదాయం రూ.42.73 లక్షలు
ఖమ్మంరూరల్ : ఈనెల 15న ప్రారంభమైన తీర్థాల జాతర బుధవారం ముగిసింది. నాలుగు రోజుల్లో దాదాపు 3.50 లక్షల మంది భక్తులు సంగమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. జాతర ముగియడంతో భక్తులు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. కాగా ఈ ఏడాది జాతర సందర్భంగా స్వామివారికి హుండీలు, దుకాణాల వేలం.. ఇలా అన్ని రకాలు కలిపి రూ.42,73,392 ఆదాయం సమకూరింది. గతేడాది కంటే ఈ సంవత్సరం రూ.2,76,194 ఆదాయం అధికంగా రావడం విశేషం.
స్నానాల లక్ష్మీపురంలో రూ.10.07 లక్షలు
వైరారూరల్: మహా శివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన జాతర ద్వారా దేవాదాయ శాఖకు రూ.10,07,596 ఆదాయం వచ్చింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. కానుకల ద్వారా రూ.3,62,950, అభిషేకం టికెట్ల ద్వారా రూ.49,200, శీఘ్ర దర్శనం ద్వారా రూ.1,31,196, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.84,900, సాధారణ దర్శనం ద్వారా రూ.45,850, జాతరలో ఏర్పాటుచేసిన దుకాణాల ద్వారా రూ.1,50,500, కొబ్బరి చిప్పల వేలం రూ.43వేలు, లడ్డూ ప్రసాదం విక్రయాల వేలం రూ.1.40 లక్షలు మొత్తంగా రూ.10,07,596 ఆదాయం సమకూరిందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది జాతర ఆదాయం రూ.9,43,564 కాగా, ఈ ఏడాది రూ.64,032 పెరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డ ఉషారాణి, సభ్యులు మల్లు శేషమ్మ, సుల్తాన్, పద్మ, తలారి నరసింహారావు, మొగునూరి సత్యనారాయణ, సర్పంచ్ నూతి వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ హరిచంద్రశేఖర్, అర్చకులు కంచెల చంద్రశేఖరశర్మ తదితరులు పాల్గొన్నారు.


