పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కల్లూరురూరల్: ఉద్యానవన శాఖ అందిస్తున్న పలు పథకాలు, రాయితీలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంవీ మధుసూదన్ కోరారు. కల్లూరు మండలంలోని హనుమాన్‌తండాలో బానోతు రాందాస్ మామిడి తోటను బుధవారం తనిఖీ చేశారు .ఫ్రూట్ బ్యాగులను పరిశీలించారు. మామిడికాయలకు ఫ్రూట్ బ్యాగులను కట్టడం ద్వారా కాయ నాణ్యత పెరుగుతుందని చీడపీడల నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం పెద్ద కోరుకొండిలో రైతు దేవభక్తిని రవి ఆయిల్‌పామ్ తోటను సందర్శించారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్‌పామ్, డ్రిప్ ఇరిగేషన్ ప్లాస్టిక్ క్రేట్స్, నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి నగేశ్, ఆయిల్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, స్కిప్పర్ కంపెనీ ప్రతినిధులు నరేశ్, సుమన్, రైతులు పాల్గొన్నారు.


