ఎరువుల బస్తా రూ. 2 వేలు
కన్నీళ్లు తెప్పిస్తున్న కాంప్లెక్స్ ఎరువుల ధర
యాసంగి సీజన్‌లో బస్తాకు రూ.250 పెంపు
పెరుగుతున్న పంటల సాగు పెట్టుబడుల భారం
ఎరువులు కొనలేం
బస్తాకు రూ.250 పెరిగింది
బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వానాకాలం సీజన్ కంటే బస్తాకు రూ. 150 నుంచి రూ. 250 వరకు పెరిగాయి. వానాకాలం సీజన్ మాదిరే ప్రస్తుత యాసంగిలోనూ సరిపడా యూరియా దొరకటం లేదు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సి వస్తోంది. ధరలు అమాంతం పెరిగిపోవటంతో ఆర్థికభారం పడుతోంది. ఎకరాకు రూ. 2వేల వరకు పెట్టుబడి పెరుగుతోంది.
నియంత్రణ చర్యలతో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల సాగులో యూరి యా వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రం యూరియా ధరలో రాయితీని భరి స్తోంది. యూరియా అధికంగా వినియోగంతో పొలా ల్లో భూసారం దెబ్బతింటోందని వ్యవసాయ అధికా రులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అటు రాయితీ భారం, ఇటు భూసారం దెబ్బతింటున్నాయనే కారణంతో ప్రభుత్వం యూరియా సరఫరాలో నియంత్రణ విధించింది. రాష్ట్రాలకు సరఫరా చేసే యూరియాలో కోతలు పెడుతోంది. వానాకాలం సీజన్‌లో రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడ్డారు. యాసంగి సీజన్‌లో అలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం యూరియా విక్రయాల కోసం ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్, సాంకేతిక సమస్యలతో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవటం, ఓటీపీలు చెప్పటం రానటువంటి రైతులు యూరియాపై ఆశలు వదులుకుంటున్నారు. ఎక్కువ ధరలైనా కాంప్లెక్స్ ఎరువులు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎరువుల దుకాణాల వద్దకు వెళితే ధరల షాక్ కొడుతోంది.
5.40 లక్షల బస్తాలు అవసరం
జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. కనీసంగా ఎకరాకు మూడు బస్తాల చొప్పున కాంప్లెక్స్ ఎరువులు వినియోగించిన 5.40లక్షల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. బస్తాకు రూ.200 చొప్పున పెరిగిన ధరలతో జిల్లా రైతులపై రూ 10.80 కోట్ల భారం పడుతుంది. అటు యూరియా దొరకక, ఇటు కాంప్లెక్స్ కొనలేక రైతులు అగచాట్లు పడుతున్నారు. కాంప్లెక్స్ ధరలను కొంతమేర తగ్గించి పెట్టుబడి భారం తగ్గించాలని రైతులు కోరుతున్నారు.
బస్తాకు రూ.150కి పైగానే...
వానాకాలం సీజన్‌లో రూ.1,900 ఉన్న 14:35:14 ఎరువుల బస్తా ప్రస్తుతం రూ.2,150కు పెరిగింది. రూ. 1,300 ఉన్న 20:20:013 కాంప్లెక్స్ ఎరువు బస్తా ప్రస్తుతం రూ.1,475కు చేరింది. నెల క్రితం వరకు రూ.1,800 ఉన్న 28:28:0:13 బస్తా ధర ప్రస్తుతం రూ.1,950కు చేరింది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా బస్తాకు రూ.150 నుంచి రూ.250 వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీతో డీఏపీ ఎరువు మాత్రం రైతులకు ప్రస్తుతం రూ.1,450కు అందుతోంది. పొటాష్, కాల్షియం ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.
వ్యవసాయం చేసేదెట్టా అని రైతుల ఆవేదన
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగటంతో వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల ధరలను తగ్గిస్తేనే రైతులు కోలుకునే పరిస్థితులుంటాయి.
– మల్లికంటి వెంకటేశ్వర్లు, రైతు, భాస్కర్‌నగర్
వానాకాలం 14:35:14 బస్తా ధర రూ.1850కు కొన్నాం. ఇప్పుడు అదే బస్తా ధర రూ. 2,150 చేరింది. పెరిగిన ధరలతో కాంప్లెక్స్ బస్తాలు కొనలేకపోతున్నాం. యూరియా ఆలైన్ బుకింగ్‌తో ఇబ్బందులు పడుతున్నాం.
– బాసిబోయిన గంగరాజు, రైతు, బూర్గంపాడు
ఎరువుల బస్తా రూ. 2 వేలు
ఎరువుల బస్తా రూ. 2 వేలు


