పిల్లలను దండించారని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పిల్లలను దండించారని ఆందోళన

Feb 19 2026 9:57 AM | Updated on Feb 19 2026 9:57 AM

పిల్లలను దండించారని ఆందోళన

పిల్లలను దండించారని ఆందోళన

సత్తుపల్లిరూరల్‌: స్కూల్‌కు విద్యార్థులు రాలేదని ప్రధానోపాధ్యాయురాలు దండించడంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టిన ఘటన సత్తుపల్లి మండలం రేజర్లలో బుధవారం చోటుచేసుకుంది. రేజర్ల హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి అనంతరం సోమవారం పలువురు విద్యార్థులు స్కూల్‌కు రాలేదు. వారిని మరుసటి రోజు హెచ్‌ఎం నాగమణి దండించింది. దీంతో బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెచ్‌ఎం, ఎంఈఓ నక్కా రాజేశ్వరావుతో వాగ్వాదానికి దిగారు. పిల్లల్ని వాతలు తేలేదాక కొట్టాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ పాఠశాలలో విచారణ నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌ విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement