రాష్ట్ర ఆర్చరీ జట్టులో ఏడుగురు జిల్లా వాసులే
ఖమ్మం స్పోర్ట్స్ : ఖేలో ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో గిరిజనులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆర్చరీ పోటీల రాష్ట్ర జట్టులో జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు ఎంపిక కావడం విశేషం. వీరు ఈనెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రం తరఫున ఆడనున్నారు. ఎంపికైన వారిలో కె.అశ్విన్‌దొర, ఈ.ఆనంద్, కె.లక్ష్మణ్, బి.శివకుమార్, కె.జ్యోత్స్న, ఈ.అవంతిక, బి.సంజనతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన క్రీడాకారుడు రవికుమార్ ఉన్నారు. కోచ్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు గొంది మారప్ప వ్యవహరించనున్నారు. జిల్లా నుంచి ఎంపికై న ఏడుగురిని జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు, వైరా ఏసీపీ సాధుల సారంగపాణి, జాతీయ ఆర్చరీ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి పుట్టా శంకరయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తదితరులు అభినందించారు.


